Actor Achyuth: దివంగత నటుడు అచ్యుత్ గుర్తున్నాడా? ఇతని సోదరుడు కూడా ఫేమస్ హీరో.. ఇప్పటికీ సినిమాలు చేస్తున్నాడు

సినిమా ఇండస్ట్రీలో అతి పిన్న వయసులో ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయిన నటుల్లో అచ్యుత్ కూడా ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు, సీరియల్స్ లో నటించిన అతను 41 ఏళ్ల వయసులోనే అనారోగ్యంతో కన్నుమూశాడు. అయితే అచ్యుత్ గురించి చాలా విషయాలు చాలా మందికి తెలియదు.

Actor Achyuth: దివంగత నటుడు అచ్యుత్ గుర్తున్నాడా? ఇతని సోదరుడు కూడా  ఫేమస్ హీరో.. ఇప్పటికీ సినిమాలు చేస్తున్నాడు
Actor Achyuth

Updated on: Aug 08, 2025 | 8:42 AM

అచ్యుత్ అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది తమ్ముడు సినిమా. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో అచ్యుత్ హీరోకు అన్నయ్యగా నటించాడు. దీంతో పాటు బావగారు బాగున్నారా, నరసింహా నాయుడు, కలిసుందాం రా, మురారి, డాడీ, వాసు ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో సహాయక నటుడిగా నటించి మెప్పించాడు. ముఖ్యంగా పవన్ నటించిన గోకులంలో సీత, తొలిప్రేమ, తమ్ముడు సినిమాలలో తన నటనతో అందర్నీ ఆకట్టుకున్నాడు అచ్యుత్. ఆరోజుల్లో పవన్ కల్యాణ్, అచ్యుత్ రియల్ లైఫ్ లోనూ అన్నదమ్ములు గానే మెలిగారని చెప్పుకునేవారు. కేవలం సినిమాలే కాదు అన్వేషిత లాంటి సూపర్ హిట్ సీరియల్స్ లో నటించాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ఇలా వెండితెర, బుల్లితెర ఆడియెన్స్ ను అలరించిన అచ్యుత్ కేవలం 42 ఏళ్ల వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. ఇండస్ట్రీలో ఎంతో ఎత్తుకు ఎదగాల్సిన ఈ యాక్టర్ 2002 లో గుండె పోటుతో కన్నుమూశాడు.

అచ్యుత్ పూర్తి పేరు కూనపరెడ్డి అచ్యుత వర ప్రసాద్. ఇతని భార్య పేరు రమా దేవి. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారని సమాచారం. ప్రస్తుతం అచ్యుత్ కుటుంబం హైదరాబాద్ లోనే ఉంటోంది. అయితే అచ్యుత్ కి ఒక సోదరుడు కూడా ఉన్నాడు. ఒకే కడుపున పుట్టకపోయినా, రక్తం పంచుకొని పుట్టుకపోయినా కూడా సొంత సోదరుడిగానే అతన్ని ట్రీట్ చేసేవాడు. అతను మరెవరో కాదు ప్రదీప్. పేరు వినగానే యాంకర్ ప్రదీప్ అనుకునేరు. నటుడు ప్రదీప్. ఇలా అంటే గుర్తు పట్టకపోవచ్చు.. కానీ ‘F2’ మరియు ‘F3’ చిత్రాల్లో ‘అంతేగా.. అంతేగా’ అనే ట్రేడ్ మార్క్ డైలాగ్ తో ఫేమస్ అయిన యాక్టర్ ఇంటే ఇట్టే కళ్ల ముందు మెదులుతాడు.

ఇవి కూడా చదవండి

భార్యతో నటుడు ప్రదీప్..

ప్రదీప్ కూడా ఒకప్పుడు హీరోగా ఓ వెలుగు వెలిగాడు. ముద్దమందారం, నాలుగు స్థంభాలాట, రెండు జెళ్ల సీత వంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీస్ లో నటించాడు. ఆ తర్వాత సీరియల్స్ లోనూ నటించారు. అప్పుడే అచ్యుత్ కు ప్రదీప్ పరిచయమయ్యారు. ప్రదీప్ తో కలిసి కొన్ని సీరియల్స్ ను నిర్మించారు అచ్యుత్. అలా ప్రొఫెషనల్ పరంగా మంచి స్నేహితులైన వీరు సొంత అన్నదమ్ములుగా మెలిగారట.
ఈ విషయాన్ని ప్రదీప్ ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అంతే కాదు అచ్యుత్ తన చేతుల్లోనే చనిపోయాడంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

అప్పట్లో ప్రదీప్ ఎలా ఉన్నారో చూశారా?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి