Mahesh Babu: మహేష్ బాబుతో ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా.. ? సూపర్ స్టార్‏తో ఆ బ్లాక్ బస్టర్ హిట్ మిస్ అయ్యింది..

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టడంతో ఎప్పుడెప్పుడు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. కొన్నాళ్ల క్రితం ఎస్ఎస్ఎంబీ 29 ప్రాజెక్ట్ కోసం జర్మనీలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు మహేష్. డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించే ఈ సినిమా ఆఫ్రికన్ అడవుల అడ్వైంచర్ మూవీగా ఉంటుందని.. ఈ సినిమాతో మహేష్ క్రేజ్ హాలీవుడ్ రేంజ్ లో ఉండడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలతో స్టార్ట్ కానుందని తెలుస్తోంది.

Mahesh Babu: మహేష్ బాబుతో ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా.. ? సూపర్ స్టార్‏తో ఆ బ్లాక్ బస్టర్ హిట్ మిస్ అయ్యింది..
Mahesh Babu

Updated on: Apr 11, 2024 | 8:02 PM

ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు జక్కన్న ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నాడు మహేష్. వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమాపైనే ఇప్పుడు అందరి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విజయేంద్రప్రసాద్ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యిందని.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టడంతో ఎప్పుడెప్పుడు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. కొన్నాళ్ల క్రితం ఎస్ఎస్ఎంబీ 29 ప్రాజెక్ట్ కోసం జర్మనీలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు మహేష్. డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించే ఈ సినిమా ఆఫ్రికన్ అడవుల అడ్వైంచర్ మూవీగా ఉంటుందని.. ఈ సినిమాతో మహేష్ క్రేజ్ హాలీవుడ్ రేంజ్ లో ఉండడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలతో స్టార్ట్ కానుందని తెలుస్తోంది.

ప్రస్తుతం మహేష్ ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్ వెకేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ తన కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతున్న ఫోటోలను ఎప్పటికప్పుడు నెట్టింట షేర్ చేస్తున్నారు మహేష్. ఈ క్రమంలోనే తాజాగా సూపర్ స్టార్ కు సంబంధించిన ఓ త్రోబ్యాక్ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. అందులో మహేష్ బాబు యంగ్ లుక్ లో కనిపిస్తుండగా.. పక్కనే మరో అమ్మాయి కనిపిస్తుంది. అయితే ఆ అమ్మాయి ఎవరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. పైన ఫోటోలో మహేష్ పక్కనే ఉన్న అమ్మాయి పేరు తారా శర్మ. ముంబై మోడల్.. బాలీవుడ్ హీరోయిన్. అప్పట్లో మహేష్ సరసన ఓ బ్లాక్ బస్టర్ హిట్ మిస్ అయ్యింది. కొన్నాళ్లు షూటింగ్ లో పాల్గొన్న ఆ బ్యూటీ.. అనుహ్యంగా సినిమా నుంచి తప్పుకుంది.

తారా శర్మ.. 2002లో అనుపమ్ ఖేర్ తెరకెక్కించిన ఓం జై జగదీష్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అదే సమయంలో ఆమెకు మహేష్ బాబు నటించిన బాబీ సినిమాలో ఛాన్స్ వచ్చింది. హిందీలో ఖోస్లా కా ఘోస్లా, పేజ్ 3, సాయా, మస్తీ చిత్రాల్లో నటించింది. నిజానికి తార సినీ రంగ ప్రవేశం మహేష్ బాబు నటించిన బాబీ సినిమాతో జరగాల్సింది. ఈ సినిమాలో ఆర్తీ అగర్వాల్ కంటే ముందు తారా శర్మను ఎంపిక చేసుకున్నారు. కానీ కొన్ని రోజుల షూటింగ్ తర్వాత ఆమెకు బాలీవుడ్ లో మరో ఆఫర్ రావడంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నారట. అలా తన ఫస్ట్ మూవీ మిస్ అయ్యిందంటూ గతంలో చెప్పుకొచ్చింది తార. మహేష్ పుట్టినరోజు సందర్భంగా సూపర్ స్టార్ కు విష్ చేస్తూ బాబీ సెట్ లో ఉన్న ఫోటోను పంచుకుంది. అందులో మహేష్ బాబు, తారాతోపాటు దివంగత దర్శకుడు శోభన్ కూడా ఉన్నారు. శోభన్ దర్శకత్వం వహించిన బాబీ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. ఇందులో మహేష్ సరసన ఆర్తీ అగర్వాల్ కథానాయికగా నటించగా.. రఘువరన్, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలు పోషించారు. ప్రస్తుతం మహేష్ ఎస్ఎస్ఎంబీ 29 కోసం రెడీ అవుతున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.