
ఏ మాత్రం అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై సంచలనం సృష్టించిన సినిమా బేబీ. సాయి రాజేష్ తెరకెక్కించిన ఈ ప్రేమకథా చిత్రంలో . ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించారు. ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన బేబీ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకక్కించినప్పటికీ సుమారు 90 కోట్లకు పైగానే కలెక్షన్లు సాధించింది. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై గోవర్ధన మారుతీ, ఎస్‍కేఎన్ నిర్మించిన ఈ సినిమాలో చాలా మంది నటించారు. నాగబాబు, హర్ష చెముడు, లిరిష, కుసుమ, బబ్లూ, కిర్రాక్ సీత తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. విజయ్ బుల్గానిన్ అందించిన పాటలు సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఇదే సినిమాకు గానూ జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు డైరెక్టర్ సాయి రాజేష్. అయితే ఈ సినిమాలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించాల్సిందట. ఈ సినిమాలోని విరాజ్ పాత్రకు ముందు విశ్వక్ ను అనుకున్నారట డైరెక్టర్ సాయి రాజేష్. ఇందుకోసం విశ్వక్ ను కూడా సంప్రదించాడట. అయితే కొన్ని కారణాలతో విశ్వక్ సేన్ ఈ సినిమా చేసేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదట.
బేబీ సినిమా సక్సెస్ మీట్ లో డైరెక్టర్ సాయి రాజేష్ చేసిన కొన్ని వ్యాఖ్యలు అప్పట్లో సంచలనమయ్యాయి. ‘ఒక హీరో ఈ సినిమాను వద్దు అన్నాడు.. కథ కూడా వినకుండానే.. వీడితో సినిమా చేసేది ఏంటి అన్నట్లు మాట్లాడాడు’ అని సాయి రాజేష్ చేసిన కామెంట్స్ అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఆ వెంటనే విశ్వక్ కూడా ఈ విషయంపై ఘాటుగానే స్పందించాడు. ‘నో అంటే నో .. అరవడం ఎందుకు.. కూల్ గా ఎవరి పని వాళ్లు చేసుకుందాం’ అని రిప్లై ఇచ్చాడు. అంటే బేబీ సినిమాను రిజెక్ట్ చేసినది విశ్వక్ సేనే అని క్లియర్ గా అర్థమైంది. అయితే విశ్వక్ సేన్ తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంచిదైందని అప్పట్ల అతని అభిమానులు అభిప్రాయపడ్డారు. సెకెండ్ హీరోగా, అందులోనూ ఓ అమ్మాయి చేతిలో మోసపోయే కుర్రాడి పాత్రలో విశ్వక్ సేన్ అసలు సూట్ కాడన్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .