Tollywood: సినిమాలంటే పిచ్చి… చేరిన 3 రోజులకే బ్యాంక్ జాబ్‌కు రిజైన్.. ఈ టాలీవుడ్ ఫేమస్ యాక్టర్ ఎవరంటే?

ఈ టాలీవుడ్ నటుడు ఇప్పటివరకు 250కు పైగా సినిమాల్లో నటించాడు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ తదితర స్టార్ హీరోల సినిమాల్లో విలన్ గా, సహాయక నటుడిగా మెప్పించాడు. తన నటనా ప్రతిభకు ప్రతీకగా జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు.

Tollywood: సినిమాలంటే పిచ్చి... చేరిన 3 రోజులకే బ్యాంక్ జాబ్‌కు రిజైన్.. ఈ టాలీవుడ్ ఫేమస్ యాక్టర్ ఎవరంటే?
Bollywood Actor

Updated on: Nov 17, 2025 | 9:43 PM

డాక్టర్ అవ్వాల్సింది అనుకోకుండా యాక్టర్ అయ్యాను.. సినిమా సెలబ్రిటీల నోటి నుంచి తరచూ వచ్చే డైలాగ్ ఇది. అయితే ఈ నటుడు చాలా డిఫరెంట్. బాగా కష్టపడి చదివి బ్యాంక్ జాబ్ కొట్టాడు. కానీ సినిమాలపై మక్కువతో 3 రోజులకే జాబ్ వదిలేశాడు. ఆపై సినిమాల్లో ట్రై చేశాడు.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇండియాలో ది మోస్ట్ వాంటెడ్ నటుడిగా ఎదిగాడు. హీరోగా కాకపోయినా విలన్ గా, సహాయక నటుడిగా వందలాది సినిమాల్లో నటించి మెప్పించాడు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్ భాషల్లో కలిపి ఇప్పటివరకు సుమారు 250కు పైగా చిత్రాల్లో యాక్ట్ చేశాడు. తన నటనా ప్రతిభకు గుర్తింపుగా జాతీయ అవార్డుతో పాటు ఫిల్మ్ ఫేర్ వంటి ప్రతిష్ఠాత్మక అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. 70 ఏళ్ల వయసులోనూ చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా ఉంటోన్న ఆ నటుడు మరెవరో కాదు పరేష రావల్.. పేరు చెబితే చాలా మంది గుర్తు పట్టకపోవచ్చు.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో లింగం మావయ్య అంటే ఇట్టే ఠక్కున గుర్తు పడతారు.

తన కెరీర్ లో ఎక్కువగా హిందీ చిత్రాల్లోనే నటించిన పరేష్ రావల్ తెలుగు ఆడియెన్స్ కు కూడా సుపరిచితమే. క్షణ క్షణం, గోవిందా గోవిందా, మనీ మనీ, రిక్షావోడు, బావగారూ బాగున్నారా, శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాల్లో పరేష్ రావల్ పోషించిన పాత్రలు హైలెట్ గా నిలిచాయి. ముఖ్యంగా శంకర్ దాదా సినిమాలో అతను పోషించిన లింగం మావయ్య రోల్ తెలుగు ఆడియెన్స్ కు తెగ నచ్చేసింది.

ఇవి కూడా చదవండి

పరేష్ రావల్ ప్రస్తుత వయసు సుమారు 70 ఏళ్లు. అయినా ఇప్పటికీ సినిమాల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. అయితే ఈ నటుడు ఓ బ్యాంక్ ఎంప్లాయ్ అని చాలా మందికి తెలియదు. పరేష్ రావల్ బాగా కష్టపడి బ్యాంక్ జాబ్ కొట్టాడు. కానీ 3 రోజులకే జాబ్ కు రిజైన్ చేసి సినిమా అవకాశాల కోసం ట్రై చేశాడు. ఎన్నో ఇబ్బందులు, కష్టాలు అధిగమించి దిగ్గజ నటుడిగా ఎదిగాడు.

ది తాజ్ స్టోరీ సినిమాలో పరేష్ రావల్..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.