
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. సలార్, కల్కి లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత వరుసగా సినిమాలను లైనప్ చేశారు ప్రభాస్. వరుస సినిమాల షూటింగ్స్ తో ప్రభాస్ చాలా బిజీగా ఉన్నారు. ప్రభాస్ లైనప్ చేసిన సినిమాల్లో సలార్ 2, కల్కి 2, రాజా సాబ్, స్పిరిట్, హను రాఘవపూడి సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాల షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇక మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ప్రభాస్ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ప్రభాస్ కు ఇండస్ట్రీలో ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. ప్రభాస్ అందరితో ఎంతో సరదాగా ఉంటాడు.
ఇక ప్రభాస్ ఫ్రెండ్స్ లిస్ట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. ప్రభాస్, అల్లు అర్జున్ ఎంతో సన్నిహితంగా ఉంటారు. అల్లు అర్జున్ తన అభిమాన హీరో ప్రభాస్ అని పలు సందర్భాల్లో తెలిపాడు. అయితే ప్రభాస్ కు మరదలిగా నటించిన ఓ నటి అల్లు అర్జున్ కు వదినగా నటించింది. ఇంతకూ ఎవరో తెలుసా.? ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ తండ్రి కొడుకులకు హీరోయిన్స్ గానూ నటించారు. కొంతమంది హీరోయిన్ పాత్రలతో పాటు అక్క, వదిన పాత్రల్లోనూ నటించి మెప్పించారు. అలాగే ఓ హీరోయిన్ ప్రభాస్ కు మరదలిగా, అల్లు అర్జున్ కు వదినగా నటించింది. ఇంతకూ ఆమె ఎవరంటే..
హీరోయిన్ సింధు తులాని గుర్తుందా.? హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరోయిన్ గా చేస్తూనే పలు సినిమాల్లో సహాయక పాత్రల్లోనూ నటించింది. అలాగా ప్రభాస్ నటించిన పౌర్ణమి సినిమాలో ప్రభాస్ మరదలిగా కనిపించింది ఈ చిన్నది. అలాగే అల్లు అర్జున్ హీరోగా నటించిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో అల్లు అర్జున్ వదినగా కనిపించింది. ప్రస్తుతం ఈ చిన్నది సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. మంచి పాత్రలు వస్తే నటించడానికి రెడీగా ఉంది సింధు తులాని.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.