
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఓజీ. సుజిత్ తెరకెక్కించిన ఈ సినిమా దసరా కానుకగా సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. పవన్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను కూడా బద్దలు కొట్టేసింది. పవన్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డుల కెక్కింది. థియేటర్లలో రూ. 350 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఓజీ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ సందడి చేస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో రికార్డులు బద్దలు కొడుతోంది. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మించిన ఓజీ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్ హీరో ఇమ్రాన హష్మీ స్టైలిష్ విలన్ గా అదరగొట్టాడు. అలాగే శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, సుహాస్, ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్, రావు రమేష్, హరీశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, వెన్నెల కిశోర్, వెంకట్, బిగ్ బాస్ శుభశ్రీ రాయగురు ఇలా ఎందరో స్టార్స్ ఓజీలో మెరిశారు. అయితే ఈ సినిమాలో పవన్ కల్యాణ్ తర్వాత బాగా హైలైట్ అయిన క్యారెక్టర్ అర్జున్ దాస్ దే అని చెప్పవచ్చు. తన తండ్రిని చంపాడంటూ పవన్ కల్యాణ్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఎదురు చూసే కుర్రాడి పాత్రలో అర్జున్ అదరగొట్టాడు.
కేవలం నటనతోనే కాదు తన బేస్ వాయిస్ తోనూ ఓజీ సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాడు. టైటిల్స్ కార్డు పడేటప్పుడు ‘అలాంటోడు మళ్లీ తిరిగి వస్తున్నాడంటే’ అంటూ అర్జున్ దాస్ ఇచ్చే వాయిస్ ఓవర్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించింది. అయితే సుజిత్ మొదట అర్జున్ రోల్ ను మరో హీరోతో చేయించాలనుకున్నాడట. అయితే అప్పటికే ఆ హీరో వేరే సినిమాలతో బిజీగా ఉన్నాడట. దీంతో అర్జున్ దాస్ ను రంగంలోకి దింపాడట. అలా ఓజీలో మంచి రోల్ మిస్ అయిన హీరో మరెవరో కాదు మలయాళం స్టార్ టొవినో థామస్. ఓజీ పాన్ ఇండియా ప్రాజెక్టు కావడంతో మలయాళం వెర్షన్ కు ఉపయోగపడేలా అర్జున్ రోల్ ను టోవినో థామస్ తో చేయిద్దామనుకున్నాడట సుజిత్. అయితే అప్పటికే అతను పలు సినిమాలతో బిజీగా ఉండడంతో అర్జున దాస్ కే ఓటేశాడట.
Thuppaki aina, nunchucks aina, katana edhaina sare ayaniki venna tho pettina vidya 🥵🔥 pic.twitter.com/goRKiqchCe
— Netflix India South (@Netflix_INSouth) October 27, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.