Baahubali: గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నారు.. బాహుబలి సినిమాను ఇంత మంది స్టార్స్ రిజెక్ట్ చేశారా?

తెలుగు సినిమా ఖ్యాతిని, ఘనతను ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రం బాహుబలి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులు సృష్టించింది. లెక్కలేనన్నీ అవార్డులు, రివార్డులు దక్కించుకుంది. అయితే మొదట ఈ సినిమాను చాలా మంది స్టార్స్ రిజెక్ట్ చేశారు.

Baahubali: గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నారు.. బాహుబలి సినిమాను ఇంత మంది స్టార్స్ రిజెక్ట్ చేశారా?
Baahubali Movie

Updated on: Jul 10, 2025 | 7:26 PM

సినిమా ఆడియెన్స్ కు పాన్ ఇండియా పేరును పరిచయం చేసిన చిత్రం బాహుబలి. ప్రభాస్- రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ తెలుగు సినిమా ఖ్యాతిని, ఘనతను ప్రపంచానికి చాటి చెప్పింది. ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్‌, నాజర్‌ల నటన.. ఎస్‌ ఎస్‌ రాజమౌళి టేకింగ్‌, ఎం.ఎం.కీరవాణి సంగీతం, సెంథిల్‌ కెమెరా వర్క్‌.. ఇలా అన్నీ కలిసి బాహుబలి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఈ విజువల్ వండర్ రిలీజై శుక్రవారం (జులై 10) కి పదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో మరోసారి బాహుబలి హ్యాష్ ట్రాగ్ ట్రెండ్ అవుతోంది. కాగా బాహుబలి మొదటి భాగం ఛాన్స్‌ మిస్‌ చేసుకున్న స్టార్స్ చాలా మందే ఉన్నారు. వారెవరో తెలుసుకుందాం రండి.

శివగామి..

బాహుబలిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది శివగామి పాత్ర. దీని కోసం మొదట దివంగత అందాల తార శ్రీదేవిని సంప్రదించారు. కానీ ఆమె నో చెప్పడంతో రమ్యకృష్ణ ఈ పాత్రలో నటించి మెప్పించారు.

కట్టప్ప

ఈ పాత్ర కోసం మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌తో పాటు సంజయ్ దత్ పేర్లు మొదట పరిశీలనలోకి వచ్చాయి. అయితే డేట్స్ కారణంగా మోహన్ లాల్ తప్పుకుంటే, సంజయ్ దత్ జైల్లో ఉండటంతో బాహుబలి అవకాశం కోల్పోయారు. చివరికి సత్యరాజ్ కట్టప్ప పాత్రలోకి ఎంటర్ అయ్యారు.

ఇవి కూడా చదవండి

భల్లాలదేవ

రానా పోషించిన ఈ పాత్ర కోసం మొదట వివేక్ ఒబెరాయ్ పేరు పరిశీలించారు. ఆయన నో చెప్పడంతో జాన్‌ అబ్రహం నూ సంప్రదించారు. అయితే చివరకు దగ్గుబాటి హీరో దగ్గరకే ఈ పాత్ర వచ్చింది.

అవంతిక

మొదట ఈ పాత్ర కోసం రాశీ ఖన్నా పేరును పరిశీలించారట. అలాగే అనిల్‌ కపూర్‌ కూతురు, బాలీవుడ్‌ నటి సోనమ్ కపూర్‌ను కూడా సంప్రదించారట. అయితే కాల్షీట్లు ఇవ్వలేకపోవడంతో తమన్నా ఎంటర్ అయ్యిందట.

దేవసేన

ఇక దేవసేన పాత్ర కోసం మొదట లేడీ సూపర్ స్టార్ నయనతారను అనుకున్నారట. కానీ ఆమె ఆసక్తి చూపించకపోవడంతో అనుష్క శెట్టిని ఆ అవకాశం వరించిందట.

బాహుబలి

ఇక ఫైనల్ గా బాహుబలి పాత్రలో ప్రభాస్‌ను తప్ప మరొకరిని ఊహించుకోలేం. అయితే హిందీ‌ వెర్షన్‌ కోసం మొదట హృతిక్‌ రోషన్‌ పేరును పరిశీలించారట. కానీ అతను అప్పటికే జోధా అక్బర్ సినిమాలో నటించి ఉండడంతో హిందీలోనూ ప్రభాస్ నే ఫైనల్ చేసేశారు. అలా మొత్తానికి ప్రభాస్‌ను పాన్‌ ఇండియా స్టార్‌ను చేసేసింది బాహుబలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి