
సినిమా ఇండస్ట్రీలో ఇటీవల విషాదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కళామ్మతల్లికి సేవలు చేసిన ఎంతో మంది నటీ నటులు ఈలోకం విడిచి వెళ్లిపోయారు. తమ నటనతో మెప్పించిన ఎంతో మంది ఇప్పుడు మన మధ్య లేదు. హీరోలు, కమెడియన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఎంతో మంది చనిపోయారు. ఇప్పుడు టీవీల్లోనో, ఓటీటీల్లోనో సినిమాలు చేస్తుంటే వారిని మిస్ అవుతున్నారు ఆడియన్స్. అయితే ఇప్పుడు మనం ఓ సినిమా గురించి మాట్లాడుకుందాం..! ఆ సినిమాలో నటించిన ఆరుగురు దిగ్గజ నటులు ఇప్పుడు మన మధ్య లేరు. ఇంతకూ ఆ హీరో ఎవరు.? ఆ సినిమా ఏది.? ఆ చనిపోయిన నటులు ఎవరో ఒక్కసారి చూద్దాం.!
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ చాలా కాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ మధ్య కాలంలో నితిన్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. సై సినిమాతర్వాత వరుసగా ఫ్లాప్స్ చూశాడు నితిన్. చాలా కాలం తర్వాత ఇష్క్ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు హిట్ అవుతూ వచ్చాయి. ఇక నితిన్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో దిల్ సినిమా ఒకటి. దిల్ సినిమాతో నితిన్ మాస్ ఆడియన్స్ కు పరిచయం అయ్యాడు. ఈ సినిమాతోనే నిర్మాత దిల్ రాజు పరిచయం అయ్యారు. వివివినాయక్ దర్శకత్వం వహించిన దిల్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో నితిన్ కు జోడీగా నేహా నటించింది. అయితే ఈ సినిమాలో నటించిన ఆరుగురు ప్రముఖ నటులు కన్నుమూశారని మీకు తెలుసా.?
దిల్ సినిమాలో నటించిన దిగ్గజ నటులు ఆరుగురు కన్నుమూశారు. దిల్ సినిమాలో తన కామెడీతో కడుపుబ్బా నవ్వించిన ఎమ్ ఎస్ నారాయణ. ఈ సినిమాలో లెక్చరర్ పాత్రలో నటించి నవ్వులు పూయించిన ఎమ్మెస్ నారాయణ అనారోగ్యంతో మరణించారు. అలాగే దిల్ సినిమాలో నితిన్ తండ్రిగా నటించిన చలపతిరావు గుండెపోటుతో మరణించారు. అలాగే నితిన్ కు మావయ్యగా నటించిన ప్రముఖ కమెడియన్ వేణుమాధవ్ కిడ్నీ సంబంధిత వ్యాధితో మరణించారు. దిల్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన ప్రముఖ నటుడు ఆహుతి ప్రసాద్ కూడా 57 ఏళ్ల వయసులో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. అదేవిధంగా సినిమాలో హీరోయిన్ కు తాత పాత్రలో నటించినటువంటి రాజన్ పి దేవ్ కూడా అనారోగ్యంతో కనుమూశారు. అలాగే ఈ సినిమాలో విలన్ పక్కన రౌడీగా నటించిన ఫిష్ వెంకట్ అనారోగ్యంతో కన్నుమూశాడు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి