మహేష్ మాత్రమే కాదు.. ఆ స్టార్ హీరో కూడా ఫిదా సినిమాను మిస్ చేసుకున్నాడట..
సాయిపల్లవికి, తెలంగాణ ప్రాంతానికి ఏదో తెలియని లింక్ ఉంది. లేకుంటే, తెలంగాణకు సంబంధించిన పాత్రలన్నీ ఆమెను వెతుక్కుంటూ వెళ్లడం ఏంటనే మాట చాలా సార్లు విన్నాం. ఫిదా సినిమాతోనే జనాలను మెప్పించారు సాయిపల్లవి. ఆ సినిమాలో ఆమె తెలంగాణ శ్లాంగ్ మాట్లాడుతుంటే ఫిదా అయిపోయారు జనాలు.

సాయి పల్లవి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సినిమా ఫిదా.. టాలీవుడ్ సెన్సిబుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల ఎన్నో అందమైన సినిమాలను ప్రేక్షకులకు అందించారు. ఆయన సినిమాల్లో కథలు చాలా సహజంగా ఉంటాయి. అచ్చం మన పక్కింట్లో జరిగే కథలు గా అనిపిస్తూ ఉంటాయి శేఖర్ కమ్ముల సినిమాలు. ఇక ఆయన తెరకెక్కించిన ఫిదా సినిమా మంచి హిట్ గా నిలిచింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. భానుమతిగా సాయి పల్లవి నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలో హీరోగానటించిన వరుణ్ తేజ్ కు కూడా మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఈ సినిమా కథను ముందుగా ఇద్దరు స్టార్ హీరోలకు చెప్పాడట శేఖర్ కమ్ముల. అందులో ఒకరు సూపర్ స్టార్ మహేష్ బాబు.
మహేష్ బాబుకు ఫిదా కథను చెప్పాడట శేఖర్ కమ్ముల. కానీ అప్పటికే మహేష్ స్టార్ డమ్ లో ఉండటం.. వరుస సినిమాలను కమిట్ అయ్యి ఉండటంతో ఆ మూవీని వదులుకున్నారట మహేష్. అలాగే మహేష్ తో పాటు మరో హీరో కు కూడా ఫిదా కథను వినిపించారట శేఖర్. ఆహీరో మరెవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.
మహేష్ తోపాటు రామ్ చరణ్ కు కూడా ఫిదా కథను చెప్పారట శేఖర్. చరణ్ కూడా ఇతర సినిమాలతో బిజీ గా ఉండటంతో అక్కడ వర్కౌట్ కాలేదట. ఫైనల్ గా ఆ సినిమా కథ వరుణ్ తేజ్ దగ్గరకు రావడం ఆయన ఓకే చెప్పి సినిమా చేయడం చకచకా జరిగిపోయాయట. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు శేఖర్ కమ్ముల. ప్రస్తుతం శేఖర్ కమ్ముల ధనుష్ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. కుభేర అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో
View this post on Instagram
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.