ఈ టాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా చెల్లెలా..!! ఈ క్రేజీ బ్యూటీ ఎవరంటే

అమెరికాకు చెందిన సింగర్ నిక్ జోనాస్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ప్రియాంక. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే లాస్ ఏంజెల్స్ కు షిఫ్ట్ అయ్యింది . అక్కడే హాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటూ తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క సినిమాకు రూ.21 కోట్ల వరకు పారితోషికం తీసుకున్న ప్రియాంక.. ఇటీవల సిటాడెల్ వెబ్ సిరీస్ కు రూ.40 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుందని సమాచారం.

ఈ టాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా చెల్లెలా..!! ఈ క్రేజీ బ్యూటీ ఎవరంటే
Tollywood Actress

Updated on: Aug 20, 2025 | 3:43 PM

భారతీయ సినిమాలో చరిత్రలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటోన్న హీరోయిన్ గా ఈ ముద్దుగుమ్మ రికార్డుల కెక్కింది. బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ సినిమాల్లోనూ నటించిన ఈ సొగసరికి అంతర్జాతీయ స్థాయిలోనూ మంచి గుర్తింపు ఉంది. ఆమె ఎవరో కాదు గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. హాలీవుడ్ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు, ఇంటర్నేషనల్ ఈవెంట్‌ల తో గ్లోబల్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుందీ ముద్దుగుమ్మ. త్వరలోనే తెలుగు ఆడియెన్స్ ను కూడా పలకరించేందుకు రెడీ అవుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు- రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో ఈ అందాల తారనే హీరోయిన్ గా ఎంపికైంది. కాగా ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు- రాజమౌళి సినిమా కోసం ప్రియాంక చోప్రా రూ. 30 కోట్ల పారితోషికం తీసుకుంటోందని తెలుస్తోంది.

6 ఏళ్ల వయసులోనే ఎంట్రీ.. అవకాశాలు లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.. ఇప్పుడు ఆమె టాప్ సింగర్

ఇదిలా ఉంటే ప్రియాంక చోప్రా చెల్లెలు కూడా టాలీవుడ్ లో తోప్ హీరోయిన్. ఆమె ఎవరో కాదు మీరా చోప్రా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బంగారం సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది మీరా చోప్రా. ఈ సినిమాతో టాలీవుడ్ లో ఫేమస్ అయ్యింది. రెండు దశాబ్దాల క్రితం ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ సినిమాల్లో నటిస్తునే ఉంది. కానీ బ్యాక్ టూ బ్యాక్ కాకుండా ఆడపాదడపా చిత్రాల్లో నటిస్తుంది. ఏడాదికి ఒకటి అర చిత్రాల్లో నటిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇదేంది మావ..! ఈ క్రేజీ బ్యూటీ కిక్ సినిమా డాక్టరా..!! అస్సలు ఊహించలేరు

కానీ సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా తన అందమైన ఫోటోస్ షేర్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ఇండస్ట్రీలో అడుగుపెట్టి రెండు దశాబ్దాలు అవుతుంది. ఈతరం హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా ఇప్పటికీ అదే అందంతో నెట్టింట మాయ చేస్తుంది మీరా. బంగారం బ్యూటీ ఎంతో అందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. కానీ ఈ బ్యూటీకి ఆఫర్స్ ఎందుకు రావడం లేదంటున్నారు ఫ్యాన్స్. తాజాగా మీరా చోప్రా ఫ్యాన్స్ అందరూ సర్ ప్రైజ్ అయ్యే విధంగా అందంగా కనిపిస్తూ నెట్టింట ఫోటోస్ షేర్ చేసింది. అందంతోపాటు ఫిజిక్ తోనూ కట్టిపడేస్తుంది మీరా. ప్రస్తుతం ఈ అమ్మడు షేర్ చేసిన పిక్స్ వైరలవుతున్నాయి.

మార్షల్ ఆర్ట్స్‌లో తోప్.. కట్ చేస్తే ఇప్పుడు ఇండస్ట్రీలోనే హాట్ బ్యూటీ.. గ్లామరస్‌కు కేరాఫ్ అడ్రస్ ఈ అమ్మడు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.