Venkatesh: వెంకీతో జోడి కట్టాల్సిన ఐశ్వర్య రాయ్.. ఛాన్స్ ఎలా మిస్సయ్యిందో తెలుసా..

|

May 10, 2023 | 4:37 PM

రాయలసీమ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించడమే కాకుండా.. ఇందులోని పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్. ఈ సినిమా విడుదలై నేటికి 26ఏళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయం ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. అదెంటంటే.. నిజానికి ఈ సినిమాలో నటించాల్సింది అంజలా ఝవేరి కాదట. మరో హీరోయిన్ అంట.. ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకుందామా.

Venkatesh: వెంకీతో జోడి కట్టాల్సిన ఐశ్వర్య రాయ్.. ఛాన్స్ ఎలా మిస్సయ్యిందో తెలుసా..
Venkatesh
Follow us on

విక్టరీ వెంకటేష్ కెరీర్‏లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ప్రేమించుకుందాం రా. 1997లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా.. ఎక్కువగానే వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రానికి జయంత్ సి. పర్జానీ దర్శకత్వం వహించగా.. మహేష్ సంగీతం అందించారు. రాయలసీమ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించడమే కాకుండా.. ఇందులోని పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్. ఈ సినిమా విడుదలై నేటికి 26ఏళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయం ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. అదెంటంటే.. నిజానికి ఈ సినిమాలో నటించాల్సింది అంజలా ఝవేరి కాదట. మరో హీరోయిన్ అంట.. ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకుందామా.

ఈ సినిమాలో కథానాయికగా అనుకున్నది ముందుగా బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్. కానీ అనుకోకుండా అంజలి హీరోయిన్ గా చేశారు. దీంతో ఈ మూవీ తర్వాత అంజలికి బ్రేక్ వచ్చింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన జయంత్ సి.పర్జానీకి ఐశ్వర్యంతో పరిచయం ఉంది. ఫ్యామిలీ ఫ్రెండ్స్ ద్వారా ఆమెతో కాంటాక్ట్ ఉండడంతో ఆమెను హీరోయిన్ గా తీసుకుందామని అనుకున్నారట. అయితే అదే విషయాన్ని నిర్మాతకు చెబితే నో అన్నారట. కారణం అప్పటికే ఆమె నటించిన సినిమాలు ప్లాప్ కావడంతోపాటు.. ప్లాప్ హీరోయిన్ గా ముద్ర పడింది. ఇక ఆ సెంటిమెంట్ తోనే ఆమెను హీరోయిన్ గా నో చెప్పారట.

ఇవి కూడా చదవండి

ఒకవేళ ఐశ్వర్య చేసి ఉంటే.. ఇదే సినిమాతో గతంలోనే తెలుగు తెరకు పరిచయమయ్యేది. గతంలో ఆమె తమిళ్ సినిమాలు తెలుగులోకి డబ్ కగా.. ఇప్పటివరకు ఆమె నేరుగా తెలుగు సినిమా చేయలేదు. చాలా కాలం గ్యా్ప్ తర్వాతా ఆమె డైరెక్టర్ మణిరత్నం నటించిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో నందినిగా కనిపించింది.