
ట్యాలెంట్ ఉన్నా అదృష్టం లేని టాలీవుడ్ హీరోల్లో సందీప్ కిషన్ ఒకడు. ఈ హీరో కెరీర్ ప్రారంభం నుంచి డిఫరెంట్ సినిమాలే చేస్తున్నాడు. వైవిధ్యమైన కథలనే ఎంచుకుంటున్నాడు. అందులో చాలా వరకు హిట్స్ అయ్యాయి. ప్రస్థానం, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ వంటి సూపర్ హిట్ సినిమాలు సందీప్ కిషన్ ఖాతాలో ఉన్నాయి. ఆ తర్వాత కూడా పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు సందీప్ కిషన్. అయితే గత కొన్నేళ్లుగా ఈ హీరోకు సరైన విజయాలు లేవు. దీంతో స్టార్ హీరో రేసులో బాగా వెనకబడిపోయాడీ ట్యాలెంటెడ్ హీరో. ఇందుకు కారణం తన సినిమాల ఎంపిక కూడా ఒక కారణమని ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు సందీప్ కిషన్. అవును.. తన దగ్గరకు వచ్చిన కొన్ని సినిమా కథలను వివిధ కారణాలతో రిజెక్ట్ చేశాడు సందీప్ కిషన్. ఇలా ఈ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో రిజెక్ట్ చేసిన సినిమాలతో ఇతర హీరోలు బ్లాక్ బస్టర్స్ అందుకున్న సందర్భాలున్నాయి.
సందీప్ కిషన్ చివరిగా మజాకా అనే సినిమాలో హీరోగా కనిపించాడు. త్రినాథరావు, నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సందీప కిషన్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నడు. అదేంటంటే.. గతంలో త్రినాథ రావు నక్కిన తెరకెక్కించిన నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే సినిమాల్లో హీరోగా మొదట సందీప్ కిషన్ కే అవకాశం వచ్చిందట. అయితే వివిధ కారణాలతో వాటిని వదులుకున్నాడట. ‘నేను లోకల్’, ‘హలో గురు ప్రేమ కోసమే’ చిత్రాల్లో మొదట హీరోగా నన్నే అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ రెండు సినిమాల్లో నటించే ఛాన్స్ మిస్ చేసుకున్నాను. ఆ సినిమాలు వేరే హీరోల దగ్గరికి వెళ్లి బ్లాక్‌బస్టర్ హిట్స్ అయ్యాయి. ఒకవేళ ఆ సినిమాలు నేను చేసి ఉంటే నా కెరీర్ ఇంకో లెవెల్‌కి వెళ్లేది. అయినా, ఇప్పుడు వస్తున్న అవకాశాల పట్ల కూడా చాలా సంతోషంగా ఉన్నాను’ అని చెప్పుకొచ్చాడు సందీప్ కిషన్.
ఓజీ దర్శకుడు సుజిత్ తో కలిసి కొత్త సినిమా లాంఛ్ లో న్యాచురల్ స్టార్ నాని..
With all your love here’s to the new beginnings.
Happy Dasara ♥️#NANIxSUJEETH @NiharikaEnt @Sujeethsign pic.twitter.com/9ojLGKA7tO— Nani (@NameisNani) October 2, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.