Sai Pallavi: డాన్స్ క్వీన్..! ఏంటీ.. ఈ పాటలను సాయి పల్లవి కొరియోగ్రాఫ్ చేసిందా..!!

ప్రస్తుతం తండేల్ విజయాన్ని ఎంజాయ్ చేస్తుంది సాయి పల్లవి. డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. మొదటి రోజు నుంచే పాజిటివ్ రివ్యూస్ అందుకున్న ఈ సినిమా.. ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ మూవీకి అన్ని వర్గాల అడియన్స్ నుంచి రెస్పాన్స్ వస్తుంది.

Sai Pallavi: డాన్స్ క్వీన్..! ఏంటీ.. ఈ పాటలను సాయి పల్లవి కొరియోగ్రాఫ్ చేసిందా..!!
Sai Pallavi

Updated on: Feb 15, 2025 | 2:46 PM

సెన్సేషనల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న  బ్యూటీ సాయి పల్లవి. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ అమ్మడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. వరుసగా హిట్స్ అందుకుంటూ దూసుకుపోతుంది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ వరుసగా హిట్స్ అందుకుంటుంది. రీసెంట్ గా అమరన్, తండేల్ సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శివకార్తికేయన్, సాయి పల్లవిగా జంటగా నటించిన అమరన్ సినిమా తమిళ్ లో తెరకెక్కినా కూడా తెలుగులోనూ సూపర్ హిట్ గా నిలిచింది. ఇక నాగ చైతన్య హీరోగా నటించిన తండేల్ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమా ఏకంగా 100కోట్లకు పైగా వసూల్ చేసి ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.

సాయి పల్లవికి ఇండస్ట్రీలో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎక్కడా స్కిన్ షో చేయకుండా అద్భుతంగా నటించి మెప్పిస్తుంది. సాయి పల్లవి నటి మాత్రమే కాదు అద్భుతమైన డాన్సర్ కూడా.. సినిమాల్లోకి రాక ముందు సాయి పల్లవి పలు టీవీ షోల్లో డాన్స్ చేసింది. తెలుగులో డాన్స్ షో ఢీలోనూ పాల్గొంది సాయి పల్లవి. ఇక సినిమాల్లో సాయి పల్లవి తన డాన్స్ తో ఆకట్టుకుంటుంది. అయితే సాయి పల్లవి ఓ సాంగ్స్ కు స్వయంగా కొరియోగ్రాఫ్ చేసుకున్న విషయం తెలుసా.?

సాయి పల్లవి కొరియోగ్రఫీ చేసుకున్న సాంగ్స్ ఏవో తెలుసా.?  సాయి పల్లవి ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో ఓ సీన్ లో హీరోకు అతని ఫ్రెండ్స్ కు సాయి పల్లవి డాన్స్ నేర్పించే సన్నివేశం ఉంటుంది. ఆ సాంగ్ కు సాయి పల్లవి స్వయంగా కొరియోగ్రాఫ్ చేసిందట. అంతే కాదు తెలుగులోనూ సాయి పల్లవి కొన్ని సాంగ్స్ లో స్టెప్స్ ను కొరియోగ్రాఫ్ చేసుకుందట. `లవ్‌ స్టోరీ` మూవీలో `సారంగ దరియా` పాటలో సాయి పల్లవి కొన్ని స్టెప్స్ కంపోజ్ చేసుకుందట. అలాగే నానితో నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో ప్రణవాలయ` పాటకి కూడా సాయిపల్లవినే కంపోజ్‌ చేసిందని టాక్. ప్రస్తుతం సాయి పల్లవి హిందీలో రామాయణం సినిమాలో నటిస్తుంది. అలాగే శింబు సినిమాలోనూ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుందట.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి