Prabhas- Trisha: త్రిష సినిమాను వద్దన్న ప్రభాస్! కట్ చేస్తే.. ఇండస్ట్రీ హిట్.. ఆ హీరోకు ఎనలేని క్రేజ్‌

టాలీవుడ్ లో ప్రభాస్, త్రిషలది బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. వర్షం, పౌర్ణమి, బుజ్జిగాడు.. ఇలా వీరి కాంబోలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సినిమాలు వచ్చాయి. అయితే త్రిష నటించిన ఓ బ్లాక్ బస్టర్ సినిమాను ప్రభాస్ మిస్ అయ్యాడని మీకు తెలుసా?

Prabhas- Trisha: త్రిష సినిమాను వద్దన్న ప్రభాస్! కట్ చేస్తే.. ఇండస్ట్రీ హిట్.. ఆ హీరోకు ఎనలేని క్రేజ్‌
Prabhas, Trisha

Updated on: May 16, 2025 | 4:40 PM

ప్రభాస్, త్రిష హీరో, హీరోయిన్లుగా నటించిన వర్షం సినిమా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో ప్రభాస్, త్రిష ల జోడీ ముచ్చటగా కనిపించింది. దీని తర్వాత పౌర్ణమి సినిమాలో మళ్లీ వీరిద్దరూ జత కట్టారు. సినిమా ఫ్లాప్ అయినా ప్రభాస్- త్రిషల కెమిస్ట్రీ అద్దిరిపోయింది. ఇందులోని పాటలైతే ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. ఇక వీరి కాంబోలో వచ్చిన మూడో సినిమా బుజ్జిగాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూడు సినిమాలతో ప్రభాస్- త్రిషలది సక్సెస్ ఫుల్ కాంబినేషన్ అన్న అభిప్రాయం ఏర్పడింది. అయితే త్రిష హీరోయిన్ గ నటించిన ఓ బ్లాక్ బస్టర్ మూవీలోనూ ప్రభాస్ హీరోగా నటించాల్సి ఉంది. ఇందుకోసం కథ కూడా విన్నాడు రెబల్ స్టార్. అయితే ఎందుకోగానీ అనూహ్యంగా మరో హీరో లైన్ లోకి వచ్చాడు. అప్పటికి అతను ఓ నార్మల్ హీరో. కానీ ఎప్పుడైతే ప్రభాస ప్లేస్ లోకి వచ్చాడో అతని సుడి తిరిగిపోయింది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ యంగ్ హీరోకు ఎనలేని క్రేజ్ వచ్చింది.

 

ఇవి కూడా చదవండి

ఇంతకీ ప్రభాస్ వదులుకున్న ఆ బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా? సిద్ధార్థ్ హీరోగా నటించిన నువ్వోస్తానంటే నేనొద్దంటానా. అవును.. మొదట ఈ మూవీలో ప్రభాసే హీరోగా నటించాల్సి ఉంది. ‘వర్షం’ సినిమాలో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ పాటకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించిన ప్రభుదేవాకి ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ మూవీని డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చాడు నిర్మాత ఎం. ఎస్. రాజు. ఇందుకోసం హీరోగా మరోసారి ప్రభాస్ నే అనుకున్నాడు. ఇందుకోసం అతనికి కథ కూడా వినిపించారు. అయితే సినిమా కథకు అమెరికాలో సెటిలైన ఎన్ఆర్‌ఐగా ఓ కొత్త కుర్రాడు అయితే బాగుంటుందని నిర్మాత ఎం.ఎస్. రాజు సూచించారట. అలా ‘బాయ్స్’, ‘యువ’ సినిమాల్లో నటించిన సిద్ధార్థ్ లైన్ లోకి వచ్చాడట. ఈ సినిమా తర్వాత సిద్దార్థ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

Nuvvostanante Nenoddantana Movie

 

కన్నప్ప సినిమాలో రుద్రుడిగా ప్రభాస్..

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.