AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్, సౌందర్య కాంబోలో మిస్ అయిన సినిమా.. ఆ మూవీ వస్తే సూపర్ హిట్ అయ్యేది..

ఏపీ డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీ ప్రజల సేవకు సమయం కేటాయించిన పవన్.. వీలైనప్పుడు తన మిగిలిన సినిమాల షూటింగ్ కంప్లీట్ చేస్తానని అన్నారు. ఈ క్రమంలోనే పవన్ అప్ కమింగ్ మూవీస్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్, సౌందర్య కాంబోలో మిస్ అయిన సినిమా.. ఆ మూవీ వస్తే సూపర్ హిట్ అయ్యేది..
Pawan Kalyan, Soundarya
Rajitha Chanti
|

Updated on: Nov 07, 2024 | 5:59 PM

Share

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ సెట్ చేశారు. బద్రి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పవన్.. ఆ తర్వాత వరుసగా భారీ విజయాలను అందుకున్నాడు. కానీ పవన్ వదలుకున్న సినిమాలు కూడా అదే రేంజ్‏లో హిట్టయ్యాయని మీకు తెలుసా. పవన్ తెలుగు సినీ పరిశ్రమలో చాలా మంది హీరోయిన్లతో కలిసి నటించారు. కాజల్, సమంత, శ్రుతి హాసన్, తమన్నా, కీర్తి సురేష్ వంటి హీరోయిన్లతో నటించారు. అలాగే రాశీ, దేవయాని, రేణు దేశాయ్, భూమిక, ఆసిన్ వంటి సీనియర్ హీరోయిన్లతోనూ జత కట్టారు. కానీ పవన్ సౌందర్య కాంబోలో ఓ హిట్ మూవీ మిస్ అయ్యిందట. మీరు విన్నది నిజమే. వీరిద్దరి కాంబోలో ఓ మూవీ స్టోరీ కూడా సిద్ధం చేసుకున్నారట.

అదే సుస్వాగతం మూవీ. అవును.. ఈచిత్రానికి కథానాయికగా ముందుగా సౌందర్యను అనుకున్నారట. డైరెక్టర్ భీమనేని శ్రీనివాసరావు ఈ చిత్రంలో పవన్ జోడిగా సౌందర్యను తీసుకోవాలనుకున్నారట. కానీ అందుకు పవన్ నో చెప్పారట. సౌందర్య అంటే తనకు ఎంతో గౌరవం ఉందని.. ఆమె ముందు నటించలేనని అన్నారట. దీంతో ఆమె స్థానంలోకి దేవయానిని తీసుకొచ్చారు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అలాగే మ్యూజికల్ హిట్ కూడా అయ్యింది.

సుస్వాగతం సినిమా టైంకే సౌందర్య స్టార్ హీరోయిన్. ఇక అప్పుడప్పుడే ఇండస్ట్రీలో విజయాలను అందుకుంటూ ప్రేక్షకులకు దగ్గరవుతున్నాడు పవన్. తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి చిత్రాలతో బాక్సాఫీస్ ను శాసించాడు. అలాంటి సమయంలోనే పవన్, సౌందర్య కాంబోలో ఆ సినిమా పడితే ఎలా ఉండేదో అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. వీరిద్దరి కాంబోలో మూవీ వస్తే వేరేలెవల్లో ఉండేదని అంటున్నారు.

ఇది చదవండి : Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్‏ను చూశారా..?

Anshu Ambani: మతిపోగొట్టేస్తోన్న మన్మథుడు హీరోయిన్.. కొత్త ఫోటోలతో మెంటలెక్కిస్తోన్న అన్షు..

Tollywood: నడుమందాలతో తికమక పెట్టేస్తోన్న వయ్యారి.. హిట్టు కొట్టిన క్రేజీ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సెకండ్ హ్యాండ్ ఏసీ కొంటున్నారా? ఈ 8 విషయాలను అస్సలు మర్చిపోవద్దు!
సెకండ్ హ్యాండ్ ఏసీ కొంటున్నారా? ఈ 8 విషయాలను అస్సలు మర్చిపోవద్దు!
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్