AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Pallavi: ఆ దర్శకుడు చేసిన పనికి.. షూటింగ్ నుంచి వెళ్లిపోవాలనుకున్న సాయి పల్లవి

సాయి పల్లవి చాలా సింపుల్ గా ఉంటుంది. ఎలాంటి లగ్జరీ ఫెసిలిటీలను సాయి పల్లవి కోరుకోదు. అందుకే దర్శక నిర్మాతలు ఎక్కువగా సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకుంటారు. ఎలాంటి డిమాండ్‌లు లేకుండా షూటింగ్‌లో పాల్గొంటుంది ఈ చిన్నది.

Sai Pallavi: ఆ దర్శకుడు చేసిన పనికి.. షూటింగ్ నుంచి వెళ్లిపోవాలనుకున్న సాయి పల్లవి
Sai Pallavi
Rajeev Rayala
|

Updated on: Nov 05, 2024 | 12:22 PM

Share

తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిన ముద్దుగుమ్మల్లో సాయి పల్లవి ఒకరు. ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ .. తెలుగులోకి ఫిదా సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోన్న సాయి పల్లవి ఇప్పుడు హిందీలోనూ సినిమాలు చేస్తోంది. రామాయణం సినిమాలో సీతగా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. సాయి పల్లవి చాలా సింపుల్ గా ఉంటుంది. ఎలాంటి లగ్జరీ ఫెసిలిటీలను సాయి పల్లవి కోరుకోదు. అందుకే దర్శక నిర్మాతలు ఎక్కువగా సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకుంటారు.

ఇది కూడా చదవండి : బుర్రపాడు గురూ ఇది.! యమదొంగలో ఉన్న ఈ చిన్నది.. ఆ బిగ్ బాస్ హాట్ బ్యూటీనా..!

ఎలాంటి డిమాండ్‌లు లేకుండా షూటింగ్‌లో పాల్గొంటుంది ఈ చిన్నది. అయితే సాయి పల్లవికి ఓ సినిమా సెట్లో కాస్త చేదు అనుభవం ఎదురైందట, షూటింగ్ స్టార్ట్ అయిన రెండు రోజుల్లోనే సాయి పల్లవి సెట్ వదిలి బయటకు వెళ్లాలనిపించిందట. ఆ సినిమా ఏది అంటే.. తమిళ స్టార్ హీరో సూర్యకు జోడీగా సాయి పల్లవి ‘NGK’ సినిమాలో నటించింది.. ఈ చిత్రానికి తమిళ స్టార్ డైరెక్టర్ సెల్వరాఘవన్ దర్శకత్వం వహించారు. సినిమాలో నటించేందుకు సాయి పల్లవి చాలా ఇంట్రెస్ట్ చూపించిందట. అయితే సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన రెండు రోజుల తర్వాత సెట్ నుంచి వెళ్లిపోవాలనే ఆలోచన వచ్చిందని తెలిపింది సాయి పల్లవి.

ఇది కూడా చదవండి : Bhanu Priya: ఇదేందయ్యా ఇది.. ఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ భాను ప్రియా చెల్లెలా..!!

ఈ విషయమై సాయి పల్లవి మాట్లాడుతూ.. ‘ సినిమాలో మేం ఏదైనా షాట్ చేసిన తర్వాత సెల్వరాఘవన్ మాకేమీ చెప్పేవారు కాదు.. నాతో కూడా సరిగ్గా మాట్లాడేవారు కాదు. నేను సరిగ్గా ప్రవర్తిస్తున్నానా.? లేదా? అనే అనుమానం వచ్చింది. సెల్వరాఘవన్ ఎలాంటి ఫీడ్‌బ్యాక్ ఇవ్వకపోవడాన్ని చూసి.. నేను సరిగ్గా నటించడం లేదని, రెండు రోజులుగా సినిమా షూటింగ్ సరిగ్గా రావడం లేదని, సినిమా నుంచి తప్పుకోవాలని అనుకున్నాను’ అని సాయి పల్లవి తెలిపింది.

ఇది కూడా చదవండి :Devara : అవకాశాలు పెరిగాయి.. ఎలాంటి పాత్ర అయినా రెడీ అంటున్న దేవర బ్యూటీ..!

అయితే ఆ తర్వాత సెల్వరాఘవన్ సోదరుడు స్టార్ యాక్టర్ ధనుష్ ఫోన్ చేసి అనుభవం ఎలా ఉందని అడిగితే సాయి పల్లవి తన సమస్య గురించి చెప్పిందట.  సెల్వరాఘవన్ నాకు ఫీడ్ బ్యాక్ ఇవ్వడం లేదు, ఇలా నటించమని కూడా చెప్పడం లేదు అని చెప్పిందట సాయి పల్లవి. అప్పుడు ధనుష్ ‘అది ఆయన స్టైల్, ముందుగా నటీనటులను పరీక్షించి, తర్వాత నటించమని అడుగుతారు’ అని అన్నారు. ఆ తర్వాత సాయి పల్లవికి కాస్త ధైర్యం వచ్చింది.

నిజానికి ‘NGK’ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. సినిమా విడుదలకు ముందే భారీ స్థాయిలో ప్రచారం జరిగింది. కానీ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. సాయి పల్లవి నటించిన అమరన్ చిత్రం ఇటీవల విడుదలైంది. సినిమాలో సాయి పల్లవి నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. తెలుగులో సాయి పల్లవి నటించిన ‘తండేల్’ చిత్రం త్వరలో విడుదల కానుంది. సాయి పల్లవి బాలీవుడ్‌లో రెండు భారీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. అమీర్ ఖాన్ పుత్ర సినిమాలో సాయి పల్లవి నటిస్తుంది. రణ్‌బీర్‌ కపూర్‌, యష్‌ల ‘రామాయణం’ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో సాయి పల్లవి సీతగా నటిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us