Naga Chaitanya-Sobhita: ఇన్‌స్టాలో పరిచయం.. ఆ విషయంలో చైతూ రిక్వెస్ట్.. కట్‌చేస్తే.. శోభితతో ఏడడుగులు
హీరో నాగచైతన్య ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది డిసెంబర్ 4న హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల మెడలో మూడు ముళ్లు వేశారు చైతూ. తాజాగా వీరిద్దరు కలిసి ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఇటీవలే అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 4న వీరిద్దరి వివాహం అన్నపూర్ణ స్టూడియోలో అంగరంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్లి వేడుకకు ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు, బంధువులు హాజరయ్యారు. పెళ్లి తర్వాత తాజాగా శోభిత, చైతన్య ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో వీరిద్దరి పరిచయం, ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మొదటిసారి 2018లో నాగార్జున ఇంటికి వెళ్లినట్లు తెలిపారు. 2022 ఏప్రిల్ తర్వాత చైతూతో తన స్నేహం మొదలైందని చెప్పుకొచ్చారు.
2022 ఏప్రిల్ నుంచి నాగచైతన్యను ఇన్ స్టాలో ఫాలో అయ్యిందట శోభిత. తనకు ఫుడ్ అంటే చాలా ఇష్టమని.. చైతన్య తన ఇన్ స్టా స్టోరీలో తన రెస్టారెంట్ గురించి పోస్ట్ చేసినప్పుడు శోభిత రిప్లై ఇచ్చిందట. అలా తమ స్నేహం మొదలైందని.. చైతన్యను ఎప్పుడూ ఫుడ్ గురించి అడగడం.. ఇద్దరూ ఎక్కడ కలిసినా ఫుడ్ గురించి మాట్లాడుకునేవాళ్లట. చైతన్య ఎప్పుడు కలిసినా తెలుగులో మాట్లాడాలని శోభితను రిక్వెస్ట్ చేసేవాడట. అలా తెలుగులో మాట్లాడుకోవడం వల్ల తమ బంధం మరింత బలపడిందట. శోభిత పోస్టలకు నాగచైతన్య లైక్ చేసేవారట. మొదటిసారి ఇద్దరూ ముంబైలోని ఓ కేఫ్ లో కలుసుకున్నట్లు చెప్పుకొచ్చింది శోభిత.
తన కోసం చైతన్య ఎప్పుడూ హైదరాబాద్ నుంచి ముంబై వచ్చేవాడని.. మొదటిసారి కలిసినప్పుడు చైతన్య బ్లూ సూట్ లో వచ్చారని తెలిపింది. ఆ తర్వాత కర్ణాటకలోని ఓ పార్కుకు వెళ్లామని.. అక్కడే ఒకరికొకరం గోరింటాకు పెట్టుకున్నామంటూ చెప్పుకొచ్చింది. నాగచైత్యం కుటుంబం తనను నూతన సంవత్సర వేడుకలకు ఆహ్వానించిందని.. ఆ తర్వాతి ఏడాది తన కుటుంబాన్ని చైతన్య కలిసినట్లు చెప్పుకొచ్చింది శోభిత. ఈ ఏడాది గోవాలో మ్యారెజ్ ప్రపోజల్ వచ్చిందని తెలిపింది.
ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‌బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..
Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‌గా..
Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..
Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‌ను మించిన అందం.. ఎవరంటే..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.