
ఇండస్ట్రీలో రాణించడం అనేది అంత సులభం కాదు. ఇప్పుడు హీరోయిన్స్ ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. అయితే ఒకప్పుడు హీరోయిన్స్ సినిమాల్లో చాలా కీలక పాత్రలు పోషించారు. అప్పటి సినిమాల్లో హీరోయిన్స్ పాత్ర చాలా ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు కేవలం పాటల కోసమే హీరోయిన్స్ అనేలా కొన్ని సినిమాలు వస్తున్నాయి. అయితే అప్పట్లో హీరోయిన్ గా నటించిన భామల్లో పైన కనిపిస్తున్న హీరోయిన్ ఒకరు. ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా నటించి మెప్పించింది. చాలా మంది హీరోయిన్స్ తమ కెరీర్ లో ఎన్నో కష్టాలు ఎదుర్కొని సక్సెస్ అయినా వారు ఉన్నారు. పై కనిపిస్తున్న హీరోయిన్ కూడా అంతే ఎన్నో కష్టాలు ఎదుర్కొని హీరోయిన్ గా సక్సెస్ అయ్యింది. పైన కనిపిస్తున్న హీరోయిన్ ఎవరంటే..
పై ఫొటోలో కనిపిస్తున్న అలనాటి హీరోయిన్ పేరు శ్రీవిద్య. తమిళ్ లో వరుసగా సినిమాలు చేసిన శ్రీ విద్య ప్రేక్షకులను మెప్పించింది. కానీ ఆమె కెరీర్ లో చాలా కష్టాలు పడ్డింది. అప్పట్లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది శ్రీ విద్య. ఈ సీనియర్ హీరోయిన్ తన 14 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చింది. తండ్రి అనారోగ్యానికి గురవ్వడంతో ఆర్ధికంగా ఇబ్బందులు రావడంతో ఆమె చిన్న వయసులోనే సినిమాల్లోఅడుగు పెట్టింది శ్రీవిద్య.
తమిళ్ లో సినిమాలు చేసిన శ్రీవిద్య. తెలుగులో మొదటి సినిమా పెదరాశి పెద్దమ్మ. ఈ అందాల నటిని తెలుగులో దాసరి నారాయణరావు ఎక్కువుగా ప్రోత్సహించారు. శ్రీవిద్య, కమల్ జంట ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఈ అమ్మడు దర్శకుడు జార్జ్ థామస్ ని పెళ్లి చేసుకుంది. ఆతర్వాత సినిమాలకు దూరం ఆయ్యింది. కానీ ఆర్ధికంగా ఇబ్బందులు రావడంతో తిరిగి సినిమాలు చేసింది. ఆతర్వాత విభేదాలు రావడంతో ఈ ఇద్దరూ విడిపోయారు. 2003 లో శ్రీ విద్య అనారోగ్యానికి గురయ్యారు. క్యాన్సర్ బారిన పడింది ఈ హీరోయిన్. తాను ఎక్కువకాలం బ్రతుకను అని తెలియగానే.. తన పేరు పై ఉన్న ఆస్తిని ఓ ట్రస్ట్ కు రాసేసింది శ్రీవిద్య. నటుడు గణేష్ సహాయంతో ఒక ట్రస్ట్ ద్వారా అర్హులైన వారికి సహాయం అందించింది శ్రీవిద్య. అప్పట్లోనే ఆమెకు కోట్ల ఆస్తులు ఉన్నాయట. దాంతో ఎంతో మంది విద్యార్థులకు సాయం అందించింది శ్రీవిద్య. 2006 లో ఆమె ఆరోగ్యం విషమించడంతో కన్నుమూశారు. ఆమె మరణంతో సినీ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..