Pawan Kalyan: పవన్ కల్యాణ్ ‘భీమ్లా నాయక్‌’ను వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా? అసలు ఊహించలేరు

వకీల్ సాబ్ తో బ్లాక్ బస్టర్ రీఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్ ఆ వెంటనే భీమ్లా నాయక్ సినిమా చేశారు. ఇందులో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా పవన్ రఫ్పాడించేశారు. సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. అయితే ఈ సినిమా కథ మొదట ఓ స్టార్ హీరో దగ్గరికి వెళ్లింది.

Pawan Kalyan: పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్‌ను వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా? అసలు ఊహించలేరు
Bheemla Nayak Movie

Updated on: May 24, 2025 | 5:04 PM

సినిమా కథలు చేతులు మారడం సినిమా ఇండస్ట్రీలో సర్వసాధారణమే. ఒక హీరో చేయాల్సిన సినిమా ఇంకో హీరో దగ్గరకు పోవడం, సూపర్ హిట్ కావడం తరచూ జరుగుతుంటుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లానాయక్ విషయంలోనూ ఇదే జరిగింది. సాగర్ కె చంద్ర తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో పవన్ తో పాటు రానా దగ్గుబాటి మరో హీరోగా నటించాడు. అలాగే నిత్యా మేనన్, సంయుక్త మేనన్ హీరోయిన్లుగా నటించారు. రావు రమేష్, మురళీ శర్మ, సముద్రఖని తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగులు అందించారు. 2022 ఫిబ్రవరి 25న విడుదలైన భీమ్లా నాయక్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా పవన్ అభిమానులకు బాగా నచ్చేసింది. సుమారు వంద కోట్లకు పైగానే వసూళ్లు సాధించిన ఈ మూవీ పవన్ రీఎంట్రీలో వరుసగా రెండో సూపర్ హిట్ మూవీగా నిలిచింది.

కాగా భీమ్లానాయక్ హీరోగా పవన్ కల్యాణ్ మొదటి ఛాయిస్ కాదట. మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్ మూవీకి అధికారిక రీమేక్ గా భీమ్లా నాయక్ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ దక్కించుకున్నారు. ఈ సినిమాలో హీరో బాలకృష్ణ అయితే బాగుంటుంది అనుకొని నాగ వంశీ ఆ మూవీ మొత్తాన్ని బాలకృష్ణ కి చూపించారట. ఇందులో మీరు ఒక పాత్ర చేయండి సార్ అని అడిగాడట. అయితే బాలకృష్ణ మాత్రం మూవీ సూపర్ గా ఉంది. కానీ నువ్వు నాకు ఏ పాత్ర చేయమని అడుగుతున్నావో ఆ పాత్రలో నాకంటే పవన్ కల్యాణ్ అద్భుతంగా ఉంటాడు అని సలహా ఇచ్చాడట.
దీంతో వెంటనే నాగ వంశీ , పవన్ కల్యాణ్ ను కలిశాడట. కథ నచ్చడంతో పవన్ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చార. అలా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవన్ కల్యాణ్ , రానా హీరోలుగా భీమ్లా నాయక్ సినిమా పట్టాలెక్కిందట.

ఇవి కూడా చదవండి

బాలకృష్ణ పవన్ పేరును సూచించడంతో..

పద్మ భూషణ్ అవార్డును అందుకుంటోన్న బాలయ్య..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.