Anushka Shetty: అనుష్క హీరోయిన్ అవ్వడానికి కారణం ఎవరో తెలుసా..? నాగార్జున అనుకుంటే పొరపాటే

|

Jun 25, 2024 | 6:38 PM

టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించింది అనుష్క.. ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో అనుష్క మెప్పించింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన అరుంధతి సినిమాతో భారీ హిట్ అందుకుంది. హీరోయిన్ అవ్వకముందు అనుష్క యోగా ట్రైనర్ గా పని చేసింది. ఇక ఈ అమ్మడు సూపర్ సినిమాతో హీరోయిన్ గా మారింది. అనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన సూపర్ చిత్రం ద్వారా ఈమె సినీరంగంలో అడుగుపెట్టింది.

Anushka Shetty: అనుష్క హీరోయిన్ అవ్వడానికి కారణం ఎవరో తెలుసా..? నాగార్జున అనుకుంటే పొరపాటే
Anushka
Follow us on

టాలీవుడ్ టాల్ హీరోయిన్ అనుష్క ప్రస్తుతం స్పీడ్ తగ్గిచింది. తెలుగులో తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా రాణించింది అనుష్క. ఈ అమ్మడి అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండడు అనడంలో అతిశయోక్తి లేదు. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించింది అనుష్క.. ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో అనుష్క మెప్పించింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన అరుంధతి సినిమాతో భారీ హిట్ అందుకుంది. హీరోయిన్ అవ్వకముందు అనుష్క యోగా ట్రైనర్ గా పని చేసింది. ఇక ఈ అమ్మడు సూపర్ సినిమాతో హీరోయిన్ గా మారింది. అనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన సూపర్ చిత్రం ద్వారా ఈమె సినీరంగంలో అడుగుపెట్టింది. ఆ తరువాత విక్రమార్కుడు, లక్ష్యం వంటి విజయవంతమైన చిత్రాల ద్వారా తెలుగు చిత్రరంగంలో స్టార్ గా మారింది.

అయితే అనుష్క కు మొదటి ఛాన్స్ ఎలా వచ్చిందో తెలుసా.. ఓ స్టార్ నటుడి ద్వారా అనుష్క హీరోయిన్ గా మారింది. అయితే చాలా మంది అనుష్కను నాగార్జున ఇండస్ట్రీకి తీసుకొచ్చారు అని అనుకుంటారు. కానీ ఆమెను రికమెండ్ చేసింది మాత్రం వేరొకరు.. ఆయన ఎవరో కాదు స్టార్ నటుడు సోనూ సూద్. అవును అనుష్క హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడనికి కారణం సోనూ సూద్. ఇదే విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

సూపర్ సినిమా టైంలో డైరెక్టర్ పూరిజగన్నాథ్ వచ్చి సోనూ సూద్ కు కథ చెప్పారట. హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన దూమ్  సినిమా టైప్‌లో కథ ఉంటుంది అని చెప్పారట. అలాగే ఈ సినిమాలో హీరోయిన్‌గా అంటే సోనూ సూద్ కి సిస్టర్ గా ఓ కొత్త అమ్మాయిని వెతుకుతున్నా అని చెప్పాడట పూరి. అయితే సోనూ సూద్ తన జిమ్‌లో ఒక అమ్మాయిని చూసా చాలా బాగుంది. హీరోయిన్ గా మంచిగా ఉంటుంది అని పూరికి చెప్పాడట. ఆతర్వాత పూరి అనుష్కను కలిసి కథ చెప్పి ఒప్పించాడట.. ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోలో అనుష్క సోనూను చూసి నువ్వెంటి ఇక్కడ ఉన్నావేంటీ.? అని అడిగిందట.. అప్పుడు పూరి చెప్పారట.. సోనూ వల్లే నువ్వు ఇక్కడ ఉన్నావ్.. అతనే నిన్ను రికమెండ్ చేసింది అని చెప్పాడట. అలా అనుష్క హీరోయిన్‌గా మారడానికి కారణం అయ్యాడు సోనూ సూద్. ఆ తర్వాత ఈ ఇద్దరూ కలిసి అరుంధతి సినిమాలో నటించారు. ఈ సినిమాలో పశుపతి అనే విలన్ గా సోనూ.. అరుంధతిగా అనుష్క అద్భుతంగా నటించి మెప్పించారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..