Murari : మురారి చూసి కృష్ణవంశీకి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసిన అమితాబ్.. ఎందుకోసమంటే

|

Aug 14, 2024 | 2:51 PM

మహేష్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన మొదటి సినిమా ఇది. ఈ సినిమా కల్ట్ క్లాసిక్ హిట్ సినిమా ఇది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించింది. సుకుమారి, కైకాల సత్యనారాయణ, గొల్లపూడి మారుతీరావు, లక్ష్మి, రఘుబాబు, రవిబాబు ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతదర్శకత్వం వహించారు.

Murari : మురారి చూసి కృష్ణవంశీకి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసిన అమితాబ్.. ఎందుకోసమంటే
Murari
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబు ఆల్ టైం హిట్స్‌లో మురారి సినిమా ఒకటి ఈ సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే.. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన మురారి సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే.. మహేష్ కెరీర్‌లో బిగెస్ట్ హిట్‌గా నిలిచిన మొదటి సినిమా ఇది. ఈ సినిమా కల్ట్ క్లాసిక్ హిట్ సినిమా ఇది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన సోనాలి బింద్రే హీరోయిన్‌గా నటించింది. సుకుమారి, కైకాల సత్యనారాయణ, గొల్లపూడి మారుతీరావు, లక్ష్మి, రఘుబాబు, రవిబాబు ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతదర్శకత్వం వహించారు. ఈ సినిమాలోని సాంగ్స్ అన్ని సూపర్ హిట్ గ నిలిచాయి. ఇప్పటికీ ఈ సినిమా సాంగ్స్‌ను ఆడియన్స్ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు నటన నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. కృష్ణవంశీ మార్క్ లో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇది కూడా చదవండి : Venu Swamy: ఇక పై సినిమా సెలబ్రిటీల జాతకాలు చెప్పను.. వీడియో వదిలిన వేణు స్వామి

మురారి భారీ విజయాన్ని నమోదు చెయ్యడమే కాకుండా ఆ ఏడాది ప్రభుత్వం ప్రకటించిన నంది పురస్కారంలో ఉత్తమ చిత్రానికి రజత నందితో పాటు మరో 2 అవార్డులను సొంతం చేసుకుంది. ఇటీవలే మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మురారి సినిమాను రీ రిలీజ్ చేశారు. రీ రిలీజ్ లోనూ మురారి సినిమా నయా రికార్డ్ క్రియేట్ చేసింది. థియేటర్స్ లో ఆడియన్స్ మురారి సినిమాను విపరీతంగా ఎంజాయ్ చేశారు. కొన్ని థియేటర్స్ లో ఫ్యాన్స్ పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు.

ఇది కూడా చదవండి :Bigg Boss 8: బిగ్ బాస్ సీజన్ 8కు హోస్ట్‌గా ఆ స్టార్ హీరోయిన్.. ఫుల్ ఖుష్ అవుతున్న ఫ్యాన్స్

అయితే మురారి సినిమా చూసిన తర్వాత బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కృష్ణవంశీకి ఫోన్ చేశారట. సినిమా చాలా బాగుంది. అద్భుతంగా తెరకెక్కించావు అంటూ కృష్ణవంశీని కొనియాడిన తర్వాత.. మురారి సినిమాను హిందీలో రీమేక్ చేయాలనీ కోరారట. తన కొడుకు అభిషేక్ బచ్చన్‌తో మురారి మూవీని రీమేక్ చేయాలనీ రిక్వెస్ట్ చేశారట. కానీ ఎందుకో అది పట్టాలెక్క లేదు. ఆ తర్వాత మరో హీరోతో హిందీలో రీమేక్ చేయాలనుకున్నారు. కానీ అది కూడా పట్టాలెక్కలేదు. తెలుగులో రిలీజ్ అయిన సినిమాలు హిందీలో చాలానే రీమేక్ అయ్యాయి. కానీ మురారి సినిమా హిందీలో రీమేక్ కాలేదు. కానీ కన్నడలో గోపి అనే పేరుతో రీమేక్ అయ్యింది. ఆ సినిమా కూడా అక్కడ సూపర్ హిట్ అయ్యింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..