Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suriya: టాలీవుడ్ సినిమా కోసం కోలీవుడ్ మూవీని పక్కన పెట్టేసిన సూర్య.. ఆ సినిమా ఎదో తెలుసా..

సౌత్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలలో సూర్య ఒకరు. ఇటీవలే రెట్రో సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. సూర్య అసలు పేరు శరవణన్ శివకుమార్. కానీ అతడి పేరును డైరెక్టర్ మణిరత్నం సూర్యగా మార్చారు.

Suriya: టాలీవుడ్ సినిమా కోసం కోలీవుడ్ మూవీని పక్కన పెట్టేసిన సూర్య.. ఆ సినిమా ఎదో తెలుసా..
Kollywood Hero Suriya
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 07, 2025 | 3:40 PM

టాలీవుడ్ లో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇతర భాషల హీరోలు చాలా మంది ఇప్పటికే తెలుగులో సినిమాలు చేసి మంచి విజయాలను అందుకున్నారు. దుల్కర్ సల్మాన్, శివకార్తికేయన్, దళపతి విజయ్ ఇప్పటికే సినిమాలు చేసి హిట్స్ అందుకున్నారు. ఇక ఇప్పుడు ధనుష్ కుబేర సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నాడు. వీరితోపాటు స్టార్ హీరో సూర్య కూడా తెలుగు డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు. లక్కీ భాస్కర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న వెంకీ అట్లూరి ఇప్పుడు సూర్యతో సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఈ సినిమాలో మమిత బైజు హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే తెలుగులో సినిమా చేయడానికి ఓ సినిమాను సూర్య పక్కన పెట్టేశాడని తెలుస్తుంది.

సూర్య ఇటీవలే కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రెట్రో అనే సినిమా చేశాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తర్వాత ఇప్పుడు వెంకీ అట్లూరి సినిమా చేస్తున్నాడు సూర్య. అయితే సూర్య తమిళ్ లో ఇప్పటికే వడివాసల్ అనే సినిమాను మొదలు పెట్టాడు. ఇప్పుడు ఈ సినిమాను సూర్య పక్కన పెట్టేశాడని తెలుస్తుంది.

వెట్రిమారన్ దర్శకత్వంలో సూర్య ఈ సినిమా చేయాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమాపనులన్నీ పూర్తయ్యాయి. మూడేళ్ళ క్రితమే ఈ కాంబినేషన్ సెట్ అయ్యింది. ఏమైందో ఏమో గానీ ఈ ప్రాజెక్ట్ అలా సైడ్ అయిపోయింది. కథ పూర్తికాలేదని తెలుస్తుంది. దాంతో ఎప్పటికప్పుడు ఈ సినిమా పక్కకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు సూర్య వెంకీ సినిమా కోసం ఈ సినిమాను పక్కన పెట్టేశాడని తెలుస్తుంది. కోలీవుడ్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. సూర్య ప్రస్తుతం టాలీవుడ్ దర్శకులతో సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాడని అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.