
అక్కినేని అందగాడు నాగ చైతన్య ఇటీవలే శోభితను పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. వీరి వివాహం హైరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరిగింది. గతకొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరు పెద్దలను ఒప్పించి ఒక్కటయ్యారు. అయితే నాగ చైతన్య శోభిత కంటే ముందు సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ చైతన్య, సమంత కలిసి ఏ మాయ చేసావే సినిమాలో నటించారు. ఆ సినిమా సమయంలోనే ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆతర్వాత కూడా కొన్ని సినిమాల్లో కలిసి నటించారు. అయితే అనుకోని కారణాల వల్ల సమంత, నాగచైతన్య విడిపోయారు. స్టార్ కపుల్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న సామ్, చై విడిపోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. తాజాగా సమంత, రాజ్ నిడమూరిని పెళ్లి చేసుకుంది. సోమవారం (డిసెంబర్ 1)న వీరిద్దరు కోయంబత్తూరులోని లింగభైరవి ఆలయంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో మూడుముళ్ల సాక్షిగా ఒక్కటయ్యారు. తాజాగా తన పెళ్లి గురించి వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు సామ్. రాజ్ తో తన పెళ్లి ఫోటోలను షేర్ చేశారు.
సమంత మాయోసైటిస్ బారిన పడటంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చి విశ్రాంతి తీసుకుంది. ఇప్పుడు తిరిగి సినిమాలతో బిజీగా మారిపోయింది. మరో వైపు నాగ చైతన్య తన సినిమాలతో బిజీగా మారిపోయాడు. ఈ క్రమంలోనే శోభిత దూళిపాళ్ళతో ప్రేమలో పడ్డాడు. శోభిత, నాగ చైతన్య కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కానీ సమంత, నాగచైతన్య, శోభిత కలిసి ఓ సినిమాలో నటించారని తెలుస్తుంది.
ఇప్పుడు ఇదే న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతుంది. ఆ సినిమా ఎదో తెలుసా.? కల్ట్ క్లాసిక్ గా నిలిచిన మజిలీ. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమాలో ముందుగా దివ్యాంక కౌశిక్ పాత్రకు శోభితను అనుకున్నాడట దర్శకుడు. శోభితతో రెండు మూడు సీన్స్ కూడా షూట్ చేశారట.. ఆతర్వాత కొన్ని కారణాలతో ఆమె సినిమా నుంచి తప్పుకుందని అంటున్నారు. దాంతో ఆమె ప్లేస్ లోకి దివ్యాంక కౌశిక్ ను తీసుకున్నారట. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో.. అలాగే ఫిలిం సర్కిల్స్ లో వైరల్ గా మారింది. కొంతమంది ఈ వార్తల్లో నిజం లేదు అని అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది. కాగా మజిలీ సినిమా నాగ చైతన్య కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బిగెస్ట్ హిట్ గా నిలిచింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .