AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pandu Master : పండు మాస్టర్ హెల్త్ అప్డేట్.. విరిగిన 2 కాళ్లు.. డాక్టర్స్ ఏం చెప్పారంటే..

డ్యాన్స్ మాస్టర్ పండుకు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. విశాఖ జిల్లా ఆనందపురం మండలంలోని లొడగలవానిపాలెం వద్ద మంగళవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కాసేపటి క్రితం ప్రెస్ మీట్ నిర్వహించిన డాక్టర్స్ పండు ఆరోగ్య పరిస్థితిని వెల్లడించారు.

Pandu Master : పండు మాస్టర్ హెల్త్ అప్డేట్.. విరిగిన 2 కాళ్లు.. డాక్టర్స్ ఏం చెప్పారంటే..
Pandu Master
Rajitha Chanti
|

Updated on: Jun 03, 2026 | 1:29 PM

Share

ప్రముఖ డాన్స్ మాస్టర్ పండు మంగళవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై మెడికవర్ హాస్పిటల్ డాక్టర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రమాదం జరిగిన తర్వాత రాత్రి రెండు గంటల ప్రాంతంలో పండు మాస్టర్‌ను ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు డాక్టర్ ప్రతాప్ రెడ్డి వివరించారు. వైద్య పరీక్షల అనంతరం పండు మాస్టర్ ఎడమ తుంటి ఎముక (హిప్ జాయింట్) జారిపోయినట్లు, అలాగే రెండు కాళ్ల మోకాళ్ల కింద ఉండే టిబియా, ఫిబులా ఎముకలు విరిగినట్లు గుర్తించారు. తక్షణ చికిత్సలో భాగంగా జారిపోయిన తుంటి ఎముకను తిరిగి సరిచేసినట్లు డాక్టర్ తెలిపారు. ప్రస్తుతం పండు మాస్టర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎటువంటి ప్రాణాపాయ పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేశారు. విరిగిన రెండు కాళ్ల ఎముకలకు ఇవాళ సర్జరీలు నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, ఈ సర్జరీలలో ప్లేట్లు లేదా రాడ్లు అమర్చాల్సి ఉంటుందని వివరించారు.

ఎక్కువమంది చదివినవి : Reema Sen : ఇండస్ట్రీలో అతడే నాకు బెస్ట్ ఫ్రెండ్.. ప్రతి విషయంతో తనతోనే షేర్ చేసుకుంటాను.. రీమా సేన్..

డాన్సర్‌గా పండు మాస్టర్‌కు తుంటి ఎముక జారిపోవడం కొంత ప్రమాదకరమైనప్పటికీ, దీనిని వెంటనే సరిచేయడం వల్ల సమస్యలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని డాక్టర్ ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. వంద మందికి ఇలా జరిగితే 2-3 శాతం మందికి మాత్రమే సమస్యలు రావచ్చని, పండు మాస్టర్ తిరిగి సాధారణ స్థితికి, డాన్స్ చేసే స్థాయికి వస్తారని అన్నారు. ప్రమాదంలో నడుముకు లేదా నరాలకు ఎటువంటి దెబ్బ తగలలేదని, కేవలం తొడలు, కాళ్లపైనే కారు టైర్ వెళ్లినట్లు ఆయన తెలిపారు. జారిపోయిన తుంటి ఎముక పూర్తిగా కోలుకోవడానికి సుమారు మూడు వారాల సమయం పడుతుందని, అయితే నడవడానికి, తిరిగి సాధారణ కార్యకలాపాలకు రావడానికి నాలుగు నుంచి ఆరు నెలల బెడ్ రెస్ట్, చికిత్స అవసరమని డాక్టర్ అంచనా వేశారు. ముఖంపై కొన్ని చిన్నపాటి గాయాలు (లాసరేటెడ్ వూండ్స్) ఉన్నప్పటికీ, వాటికి కుట్లు వేస్తే నయమవుతాయని, అవి పెద్ద సమస్య కాదని తెలిపారు.

ఎక్కువమంది చదివినవి : Raghavendra Rao : అది గొప్ప పాట.. జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన సాంగ్.. రాఘవేంద్ర రావు మనసులో నిలిచిపోయిన పాట ఇదే..

ప్రమాదం ఎలా జరిగిందనే విషయానికి వస్తే, పేషెంట్ అటెండర్లు ఇచ్చిన సమాచారం ప్రకారం, ప్రమాదానికి ముందు పండు మాస్టర్ వాంతి చేసుకుంటున్న సమయంలో కారు దిగి ఉన్నారని, ఆ సమయంలో వెనుక నుండి వచ్చిన ఒక లారీ ఢీకొనడంతో, ఆ కారు ఆయనను డాష్ ఇచ్చి పడిపోయినట్లు తెలిసింది. కారు టైరు ఆయన నడుము మీదుగా కాకుండా, థైస్ , కాళ్ల మీదుగా వెళ్ళిందని, కాబట్టి నరాలకు ఎటువంటి నష్టం జరగలేదని, కాళ్లు చేతులు బాగానే ఆడిస్తున్నారని డాక్టర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. కాళ్ల ఫ్రాక్చర్లు పూర్తిగా అతుక్కున్న తర్వాత ఫిజియోథెరపీ ప్రారంభమవుతుందని చెప్పారు. పూర్తి స్థాయిలో డ్యాన్స్ చేసే స్థాయికి తిరిగి రావడానికి ఆయనకు నాలుగు నుంచి ఆరు నెలల సమయం పట్టవచ్చని డాక్టర్ ప్రతాప్ రెడ్డి అంచనా వేశారు. ఈ మొత్తం కాలంలో ఫిజియోథెరపీ , సరైన వైద్య సంరక్షణ చాలా ముఖ్యమని ఆయన అన్నారు. ప్రస్తుతం పండు మాస్టర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నందున, ఆయన త్వరగా కోలుకుని తిరిగి తమ అభిమానులను అలరించాలని ఆశిస్తున్నారు.

ఎక్కువమంది చదివినవి : Maheswari: ఆ హీరో అంటే క్రష్.. పిచ్చిగా ప్రేమించా.. చెల్లి అని మనసు ముక్కలు చేశాడు.. హీరోయిన్ మహేశ్వరి..

ఎక్కువమంది చదివినవి : ఏం సినిమా రా బాబూ.. ఒక్కో సీన్ ఊపిరి బిగపట్టి చూడాల్సిందే.. ఓటీటీలో రచ్చ చేస్తున్న మలయాళీ

Follow Us