Kubera Twitter Review : కుబేర ట్విట్టర్ రివ్యూ..! ధనుష్ ఇరగదీశాడట భయ్యా..!!

డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమాల గురించి చెప్పక్కర్లేదు. తెలుగు సినీరంగంలో కంటెంట్ కు విలువనిచ్చే దర్శకులలో ఆయన ఒకరు. కమర్షియల్ హంగులకు తావులేకుండా హృదయాలను హత్తుకునే కథలను.. హృద్యమైన ఎమోషన్లతో రూపొందించడంలో శేఖర్ కమ్ముల ముందుంటారు. అందమైన కథను మరింత అద్భుతంగా తెరపై ఆవిష్కరిస్తుంటారు.

Kubera Twitter Review : కుబేర ట్విట్టర్ రివ్యూ..! ధనుష్ ఇరగదీశాడట భయ్యా..!!
Kuberaa

Updated on: Jun 20, 2025 | 8:05 AM

స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ స్టార్ హీరో. ధనుష్ చాలా వేగంగా సినిమాలు చేస్తుంటాడు. తెలుగు, తమిళ్, హిందీ బాషలతో పాటు హాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇక ప్రస్తుతం తెలుగులో సినిమా చేస్తున్నాడు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా నేడు జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటించారు. అలాగే రష్మిక మందన్న మరో ముఖ్య పాత్రలో కనిపించింది. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్స్ పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుపుతున్నారు.

ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. డీఎస్పీ సంగీతంలో ధనుష్ తొలిసారిగా కుబేర చిత్రంలో ఓ పాట పాడడంతో అభిమానుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. ఇక సినిమా చాలా బాగుందని అంటున్నారు ప్రేక్షకులు. ముఖ్యంగా ధనుష్ నటన సినిమాకే హైలైట్ అని .. బిచ్చగాడి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించడాని అంటున్నారు. అలాగే నాగ్ కూడా తన నటనతో కట్టిపడేశాడని అంటున్నారు. శేఖర్ కమ్ముల కథ, తెరకెక్కించిన విధానం చాలా బాగున్నాయని ప్రశంసిస్తున్నారు నెటిజన్స్..

ఇవి కూడా చదవండి

కుబేర మూవీ ట్విట్టర్ రివ్యూ..

కుబేర మూవీ ట్విట్టర్ రివ్యూ..

కుబేర మూవీ ట్విట్టర్ రివ్యూ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.