Kubera Movie: ధనుష్, నాగార్జునల కుబేర రిలీజ్‌ డేట్ ఫిక్స్.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం కుబేర. టాలీవుడ్ లో ఫీల్ గుడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది.

Kubera Movie: ధనుష్, నాగార్జునల కుబేర రిలీజ్‌ డేట్ ఫిక్స్.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్
Kubera Movie

Updated on: Feb 27, 2025 | 7:59 PM

‘ఆనంద్’, ‘గోదావరి’, ‘హ్యాపీ డేస్’, ‘లీడర్’, ‘ఫిదా’, ‘లవ్ స్టోరీ’ సినిమాలతో టాలీవుడ్ లో ఫీల్ గుడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారే శేఖర్ కమ్ములు. ఇప్పుడు ఆయన తొలిసారిగా స్టార్ హీరోల సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న సినిమా కుబేర.
పెద్దగా హడావిడి లేకుండా ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్లు మూవీపై ఆసక్తిని పెంచాయి. తమిళం, తెలుగు భాషల్లో ఒకేసారి కుబేర నిర్మిస్తున్నారు. తాజాగా ఈ క్రేజీ మూవీ విడుదల తేదీని గురువారం (ఫిబ్రవరి 27) ప్రకటించారు. ‘కుబేర’ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ‘పవర్ కు సంబంధించిన స్టోరీ.. సంపద కోసం జరిగే యుద్ధం.. విధి ఆడించే ఆట.. శేఖర్ కమ్ముల కుబేర అత్యద్భుతమైన థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ను అందించడానికి జూన్ 20న రాబోతోంది’ అని కుబేర రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. అటు నటి రష్మిక మందన్నా కూడా రిలీజ్ డేట్ గురించి ట్వీట్ చేసింది.

కాగా ఈ సినిమాలో ధనుష్ బిచ్చగాడిగా, నాగార్జున ధనవంతుడిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు రిలీజైన పోస్టర్లు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్ లో సునీల్ నారంగ్, రామ్మోహన్ రావు ఈ మూవీని నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

జూన్ 20 న కుబేర సినిమా రిలీజ్..

 

కాగా ‘కుబేర’ సినిమాతో పాటు, రష్మిక మందన్న, సల్మాన్ ఖాన్ నటించిన ‘సికంధర్’ సినిమా విడుదల తేదీని కూడా ఈరోజు ప్రకటించారు. ఈ సినిమా ఈద్ సందర్భంగా విడుదల కానుంది.

కుబేర సెట్ లో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి