Dhanush- Aishwarya: విడాకులకు దరఖాస్తు చేయని ధనుష్‌, ఐశ్వర్య.. మళ్లీ కలుస్తారా? అసలు నిజమేంటంటే?

కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌, ఐశ్వర్యా రజనీకాంత్‌ విడిపోయి ఏడాదిన్నర కావొస్తోంది. 18 ఏళ్ల దాంపత్య బంధానికి వీడ్కోలు పలుకుతూ గతేడాది ప్రారంభంలో వీరిద్దరూ విడిపోయారు. ఈ మేరకు త్వరలోనే విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్‌ మీడియాలో అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. అయితే అప్పటి నుంచి ధనుష్‌, ఐశ్వర్య మళ్లీ కలుస్తారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

Dhanush- Aishwarya: విడాకులకు దరఖాస్తు చేయని ధనుష్‌, ఐశ్వర్య.. మళ్లీ కలుస్తారా? అసలు నిజమేంటంటే?
Dhanush, Aishwarya

Updated on: Oct 15, 2023 | 4:30 PM

కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌, ఐశ్వర్యా రజనీకాంత్‌ విడిపోయి ఏడాదిన్నర కావొస్తోంది. 18 ఏళ్ల దాంపత్య బంధానికి వీడ్కోలు పలుకుతూ గతేడాది ప్రారంభంలో వీరిద్దరూ విడిపోయారు. ఈ మేరకు త్వరలోనే విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్‌ మీడియాలో అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. అయితే అప్పటి నుంచి ధనుష్‌, ఐశ్వర్య మళ్లీ కలుస్తారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. రజనీకాంత్‌ కూడా వీరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించారని ప్రచారం జరిగింది. అయితే అదేమీ జరగలేదు. ధనుష్‌, ఐశ్వర్య ఇంకా విడాకులు తీసుకోలేదు కానీ ఇద్దరూ ఏకాభిప్రాయంతోనే వేర్వేరుగానే జీవిస్తున్నారు. అయితే పిల్లల విషయంలో తల్లిదండ్రులుగా ఇద్దరూ తమ బాధ్యతను నెరవేరుస్తున్నారు. ఇదిలా ఉంటే వీరిద్దరూ విడాకుల విషయంలో ఓ అడుగు వెనక్కు వేశారని, త్వరలోనే మళ్లీ కలవబోతున్నారన్న ఊహాగానాలు ఈ మధ్యన మళ్లీ ఊపందుకున్నాయి. ఇందుకు కారణం ఈ జంట విడాకులకింకా దరఖాస్తు చేయకపోవడమే. అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది. విడాకుల విషయంలో ధనుష్‌, ఐశ్వర్య ఎలాంటి వెనకడుగు వేయలేదని తెలుస్తోంది.

ధనుష్‌, ఐశ్వర్య ప్రస్తుతం ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటున్నారు. వ్యక్తిగత విషయాలపై దృష్టి పెట్టకుండా తమ కెరీర్‌పైనే ఎక్కువగా ఫోకస్‌ చేస్తున్నారు. హీరోగా ధనుష్‌ వరుసగా సినిమాలు చేస్తోంటే, డైరెక్టర్‌గా, నిర్మాతగా బిజీ అయ్యేందుకు ఐశ్వర్య ప్రయత్నిస్తోంది. దీంతో వీరు మళ్లీ కలిసిపోనున్నారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ఇక రెండో పెళ్లి ఆలోచన కూడా తమ మదిలో లేదంటున్నారట. ధనష్‌, భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ ఒకరిపై మరొకరికి ఎనలేని గౌరవం ఉంది. ముఖ్యంగా తమ పిల్లల కోసం కొన్ని కార్యక్రమాల్లోనూ కలిసి పాల్గొంటున్నారు. అలాగనీ తిరిగి కలిసిపోయే ఛాన్స్‌ మాత్రం లేదంటున్నారు. కాగా ధనుష్‌ ప్రస్తుతం తన 50వ సినిమా పనుల్లో బిజీగా ఉంటున్నాడు. అయితే అంతకు ముందే కెప్టెన్‌ మిల్లర్‌గా త్వరలోనే మన ముందుకు రానున్నాడు. ఇందులో వైవిధ్యమైన గెటప్‌లతో ధనుష్‌ కనిపించనున్నాడని టాక్‌ వినిపిస్తోంది. ఇందులో తెలుగు హీరో సందీప్‌ కిషన్‌, శివరాజ్‌ కుమార్‌, ప్రియాంకా అరుళ్‌ మోహన్‌, జాన్‌ కొక్కెన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అరుణ్‌ మాతేశ్వరన్‌ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ డిసెంబర్‌ 15న రిలీజ్‌ కానుంది.

ఇవి కూడా చదవండి

 

తండ్రి రజనీకాంత్ తో ఐశ్వర్య…

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.