
స్టార్ హీరో ధనుష్(Dhanush), ఐశ్వర్య( Aishwarya Rajinikanth) దాదాపు 18ఏళ్ల వివాహబంధానికి స్వస్తి చెప్పిన విషయం తెలిసిందే. ఇంతకాలం అన్యున్యంగా కలిసున్న ఈ జంట అనూహ్యంగా విడిపోతున్నట్టు ప్రకటించి షాక్ ఇచ్చారు. ధనుష్ ఐశ్వర్య విడిపోవడాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. విడిపోతున్నాం అని ప్రకటించిన అనంతరం ధనుష్ తన ప్రొఫైల్ లో పేరు మార్చేశారు. అయితే ఐశ్వర్య మాత్రం కొద్దిరోజులు ఆలాగే ఉంచి రీసెంట్ గా తాను కూడా పేరు మార్చుకున్నారు. ఐశ్వర్య రజినీకాంత్ గా తన ప్రొఫైల్ పేరు మార్చారు. అయితే విడాకుల తర్వాత ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఈ ఇద్దరు కలిసి కనిపించారు. విడాకుల తర్వాత మొదటిసారి ధనుష్, ఐశ్వర్య కలిసి కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ కలిసిపోతున్నారా అంటూ గుసగుసలాడుకుంటున్నారు.
అసలు విషయం ఏంటంటే.. ధనుష్, ఐశ్వర్య తో విడిపోయిన దగ్గరనుంచి ఆయన ఇద్దరు కుమారులతో కలిసి ఉంటున్నారు. రీసెంట్ గా ఆయన కుమారుడు యాత్ర స్కూల్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి ఈ ఇద్దరు హాజరయ్యారు. ‘ఈ రోజు అద్భుతంగా మొదలైంది. స్పోర్ట్స్ కెప్టెన్‌గా నా పెద్ద కొడుకు ఎంపికయ్యాడు.. అంటూ ఐశ్వర్య సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. అలాగే ఫ్యామిలీ తో కలిసి ఉన్న ఫోటోను ఇన్స్టా స్టోరీలో షేర్ చేశారు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దాంతో ఈ ఫొటోస్ చూసిన ఫ్యాన్స్ మళ్లీ ఈ ఇద్దరు కలుస్తున్నారా అని మాట్లాడుకుంటున్నారు. ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే హాలీవుడ్ మూవీలో కనిపించాడు. అలాగే తిరు అనే సినిమాతో రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అలాగే తెలుగులో సార్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నాడు ధనుష్.
What a way to start the day ! Monday morning watching the Investiture Ceremony of school ,where my first born takes up oath as sports captain?#proudmommymoment #theygrowupsofast ? pic.twitter.com/91GMsGsLhG
— Aishwarya Rajinikanth (@ash_rajinikanth) August 22, 2022
Aishwarya Rajinikanth Danusమరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి