Tollywood: దుమ్ము దుమారమే.. దేవుళ్లు సినిమాలోని పాప.. ఇప్పుడు ఇంత హాట్‌గా

|

Oct 11, 2024 | 7:34 AM

దేవుళ్లు సినిమా పాప నిత్యా శెట్టి ఇప్పుడు హీరోయిన్‌గా మంచి ఆఫర్లను దక్కించుకుంటోంది. కానీ ఇంత వరకు ఆమెకు రావాల్సిన స్టార్డం అయితే రాలేదు. నిత్యా శెట్టి తన ప్రాజెక్టులతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది.

Tollywood: దుమ్ము దుమారమే.. దేవుళ్లు సినిమాలోని పాప.. ఇప్పుడు ఇంత హాట్‌గా
Follow us on

దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ..  విలక్షణ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఎన్నో అద్భుతమైన చిత్రాలను ఆయన తెరకెక్కించారు. అగ్ర హీరోలతో ప్రయోగాలు చేసి.. విజయాలు అందుకున్నారు. బహుశా ఆయన టచ్ చేసినన్ని సబ్జెక్ట్స్.. మరే తెలుగు దర్శకుడు చేయలేదు. భవిష్యత్‌లో చేయలేరు ఏమో. సోషల్ ఫాంటసీ, ఫ్యామిలీ,  భక్తిరస, ఇతిహాస సినిమాలు కూడా చేసి వారెవ్వా అనిపించారు కోడి రామకృష్ణ. కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చి బ్లాక్ బాస్టర్ అయిన మరో చిత్రం దేవుళ్లు. 2000లో వచ్చిన ఈ సినిమాను జనం విపరీతంగా ఆదరించారు. చిన్న పిల్లలతో ఈ సినిమా మొత్తం నడిపించారు దర్శకుడు కోడిరామకృష్ణ. ఈ సినిమాలో మాస్టర్ నందన్, బేబీ నిత్య లీడ్ రోల్స్ చేశారు.

ఇద్దరు చిన్నారులు పేరెంట్స్‌కి చెప్పకుండా పుణ్యక్షేత్రాలు ఎలా తిరిగారు. ముడుపులు ఎలా చెల్లించారు..  వారికి దేవుళ్లు ఎలా సాయం చేశారు అనే కథాశంతో ఈ సినిమాను చాలా ఎంగేజింగ్‌గా తెరకెక్కించారు.ఇదిలా ఉంటే ఈ చిత్రంలో నటించిన పిల్లల్లో బేబీ నిత్య ఇప్పుడు ఎలా ఉందో చూస్తే బిత్తరపోవాల్సిందే. తన అందంతో..  కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది ఈ బ్యూటీ. బేబీ నిత్య పూర్తి పేరు నిత్యా శెట్టి. తను ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది

నువ్వు తోప్ రా.., పిట్ట కథ, వాంటెడ్ పండుగాడు, పడేశావే  లాంటి చిత్రాల్లో నటించింది ఈ చిన్నది. ప్రస్తుతం ఇండస్ట్రీ కాస్త దూరమైంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేస్తున్న ఫోటోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. నిత్యా శెట్టి  అందాలకు కుర్రాళ్లు ఫిదా అయిపోతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.