
తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రదానోత్యవం ఎంతో ఘనంగా జరుగుతుంది.ఈ అవార్డుల వేడుకలో రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఇరగదీశారు. తన సాంగ్స్ పారామెన్స్ తో స్టేజ్ పై సందడి చేశారు దేవి. సూపర్ హిట్ సాంగ్స్ పాడుతూ అవార్డుల వేడుకకు హుషారు తెచ్చారు దేవి శ్రీ… హుషారైన స్టెప్పులతో ఆకట్టుకున్నారు దేవీ శ్రీ. అలాగే తెలంగాణ డప్పులతో అదరగొట్టారు దేవీ శ్రీ ప్రసాద్. అలాగే తాను హీరోగా నటిస్తున్న ఎల్లమ్మ సినిమా నుంచి పాట పాడి అందరిని అలరించారు దేవీ శ్రీ ప్రసాద్. వేణు ఎల్దండి దర్శకత్వంలో ఎల్లమ్మ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఓ పవర్ ఫుల్ సాంగ్ ను స్టేజ్ పై ఆలపించి మెప్పించారు దేవీ శ్రీ ప్రసాద్.
అలాగే దేవీ శ్రీతో కలిసి గోంగూర తోటకాడ పాటకు రష్మిక మందన్న, దిల్ రాజు చేత స్టెప్పులేయించారు దేవీ శ్రీ ప్రసాద్. అలాగే దేవీ శ్రీ ప్రసాద్ గద్దర్ అవార్డుల వేదికగా రెండోసారి తండ్రి అయిన రామ్ చరణ్ విషెస్ తెలిపాదేవీ శ్రీ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి