Devi Sri Prasad: “శ్రీవల్లి సాంగ్ కేవలం నాలుగున్నర నిమిషాల్లో చేశా”.. దేవీ శ్రీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

దేవీ శ్రీ ప్రసాద్ ఇటీవలే జాతీయ అవార్డును గెలుచుకున్న విషయం తెలిసిందే. బెస్ట్ మ్యూజిక్ కంపోసర్ గా దేవీ శ్రీ జాతీయ అవార్డును గెలుచుకున్నారు. పుష్ప సినిమాకు గాను ఆయనకు ఈ అవార్డు లభించింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమాలో నటనకు గాను అల్లు అర్జున్ కు బెస్ట్ యాక్టర్ గా అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. అలాగే దేవీకి కూడా.. పుష్ప సినిమాలో సాంగ్స్ అన్ని సూపర్ హిట్ గా నిలిచాయి.

Devi Sri Prasad: శ్రీవల్లి సాంగ్ కేవలం నాలుగున్నర నిమిషాల్లో చేశా.. దేవీ శ్రీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Devi Sri Prasad

Updated on: Nov 23, 2023 | 12:56 PM

రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సాంగ్స్ అంటే చెవికోసుకునే ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. ఆయన అందించే సంగీతం సినిమాల విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది అనడంతో ఎలాంటి అతిశయోక్తి లేదు. దేవీ శ్రీ ప్రసాద్ ఇటీవలే జాతీయ అవార్డును గెలుచుకున్న విషయం తెలిసిందే. బెస్ట్ మ్యూజిక్ కంపోసర్ గా దేవీ శ్రీ జాతీయ అవార్డును గెలుచుకున్నారు. పుష్ప సినిమాకు గాను ఆయనకు ఈ అవార్డు లభించింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమాలో నటనకు గాను అల్లు అర్జున్ కు బెస్ట్ యాక్టర్ గా అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. అలాగే దేవీకి కూడా.. పుష్ప సినిమాలో సాంగ్స్ అన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. ప్రపంచ వ్యాప్తంగా పుష్ప సాంగ్స్ ప్రేక్షకులకు ఉర్రుతలూగించాయి.

పుష్ప సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు దేవీ శ్రీ.ముఖ్యంగా ఈ సినిమాలో ఉ అంటావా మామ.. సాంగ్ అలాగే శ్రీ వల్లి సాంగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. శ్రీవల్లి సాంగ్ లో హుక్ స్టెప్ ఎంత ఫేమస్ అయ్యిందో అందరికి తెలుసు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరు ఈ స్టెప్ వేసి సోషల్ మీడియాలో ఆవీడియోలను షేర్ చేశారు.

తాజాగా దేవీ శ్రీ ప్రసాద్ పుష్ప సాంగ్స్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. పుష్ప సినిమాలో శ్రీ వల్లీ సాంగ్ చేయడానికి తనకు కేవలం నాలుగు నిమషాలా ముపై సెకండ్స్ మాత్రమే సమయం పట్టిందని తెలిపారు. ఈ సాంగ్ కు ముందుగా తన గిటార్ తో ఓ హమ్మింగ్ అనుకున్నా.. ఆతర్వాత ఈ సినిమాలో హీరోయిన్ పేరు శ్రీవల్లీ కావడంతో ఆ పేరును ఇంక్లూడ్ చేశా.. అని తెలిపారు. మొత్తంగా ఈసాంగ్ చాలా పాపులర్ అవ్వడం ఆనందంగా ఉంది అని అన్నారు దేవీ శ్రీ.

దేవీ శ్రీ ప్రసాద్ ట్విట్టర్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.