Pawan Kalyan: పవన్‌ పుట్టిన రోజున సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చిన దేవీశ్రీ.. అప్పట్లో కుదరని ఓ వీడియో విడుదల.

|

Sep 02, 2021 | 8:20 AM

Pawan Kalyan Birthday: పవన్‌ కళ్యాణ్‌కు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం ప్రేక్షకులే కాకుండా ఇండస్ట్రీకి చెందిన వారు కూడా పవన్‌ను ఆరాధిస్తుంటారు....

Pawan Kalyan: పవన్‌ పుట్టిన రోజున సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చిన దేవీశ్రీ.. అప్పట్లో కుదరని ఓ వీడియో విడుదల.
Pawan Birthday
Follow us on

Pawan Kalyan Birthday: పవన్‌ కళ్యాణ్‌కు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం ప్రేక్షకులే కాకుండా ఇండస్ట్రీకి చెందిన వారు కూడా పవన్‌ను ఆరాధిస్తుంటారు. ఏదో ఒక సందర్భంలో పవన్‌పై తమకున్న ఇష్టాన్ని వేదికపై బహిరంగంగా చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలాంటి వారిలో సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌ ఒకరు. మెగా ఫ్యామిలీపై తనకున్న అభిమానాన్ని చాటుకునే దేవీ తాజాగా పవన్‌ కళ్యాణ్‌ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు ఓ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చాడు. ఓ అరుదైన వీడియోను పోస్ట్‌ చేస్తూ.. పవన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

పవన్ కళ్యాణ్‌ హీరోగా తెరకెక్కిన చాలా సినిమాలకు దేవీ సంగీతాన్ని అందించాడు. అందులో జల్సా సినిమా ఒకటి. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మ్యూజికల్‌గా కూడా మంచి విజయాన్ని అందుకుంది. సిరివెన్నెల సాహిత్యానికి దేవీ బీట్స్‌ కలవడంతో జల్సా పాటలు అప్పట్లో మారుమోగాయి. ఇదిలా ఉంటే జల్సా సినిమా సమయంలో దేవీ శ్రీ ప్రసాద్‌ ఓ ప్రమోషన్‌ సాంగ్‌ను రూపొందించారు. అయితే సమయం లేకపోవడంతో ఈ పాటను అప్పట్లో విడుదల చేయలేకపోయారు. తాజాగా పవన్‌ బర్త్‌డేను పురస్కరించుకొని దేవీశ్రీ ఈ పాటను తాజాగా విడుదల చేశారు. ట్విట్టర్‌ వేదికగా ‘పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ సర్‌ పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక వీడియో ద్వారా మా ప్రేమను తెలియజేస్తున్నాను’ అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియోను పవన్‌ ఫ్యాన్స్‌ తెగ చూసేస్తున్నారు.

Also Read: Viral Video: పెళ్లి మండపంలో వధువుతో వరుడు సరసాలు.. వీడియో చూస్తే ఫిదా కావాల్సిందే.!

Trisha Marriage: త్రిష పెళ్లి పీటలెక్కడానికి సిద్ధమవుతోందా.. దానికి ఇదే నిదర్శనమా.. అసలు విషయమేంటంటే.!

Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ వాయిదా పడుతోందా ?.. నెట్టింట్లో టాక్.. ఆ పోస్టర్‏తో రూమర్లకు చెక్..