టాలీవుడ్ రాక్‌స్టార్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఇంట పండగ వాతావరణం నెలకొంది. అతని తమ్ముడు, టాలీవుడ్ ప్రముఖ సింగర్ సాగర్ రెండోసారి తండ్రిగా ప్రమోషన్ పొందాడు. సాగర్ భార్య సతీమణి మౌనిక రెండు రోజుల క్రితం పండంటి మగబిడ్డను ప్రసవించింది. మౌనిక ఫిబ్రవరి 21న బిడ్డకు జన్మనిచ్చినట్లు ప్రముఖ నిర్మాత, సినిమా జర్నలిస్టు సురేష్ కొండేటి సోషల్ మీడియా పోస్టు షేర్ చేశాడు. దీంతో సాగర్- మౌనిక దంపతులకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 2019లో పెళ్లిపీటలెక్కిన సాగర్-మౌనిక దంపతులకు ఇది రెండో సంతానం. ఇప్పటికే ఈ దంపతులకు వివాన్ దక్ష్‌అనే కుమారుడు జన్మించాడు. గతేడాది సెప్టెంబర్ 18న వివాన్ మొదటి పుట్టిన రోజు వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. ఈ సందర్బంగా సాగర్ కుమారుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ దేవిశ్రీ ప్రసాద్ ట్వీట్ చేశాడు. ఇప్పుడు సాగర్ మరోసారి తండ్రి అవ్వడవంతో రాక్‌స్టార్ ఇంట సంబరాలు మొదలయ్యాయి.
దేవిశ్రీప్రసాద్ లాగే సాగర్ కూడా సింగర్. టాలీవుడ్ లో పలు సూపర్ హిట్ పాటలను ఆలపించాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో వచ్చిన వర్షం, ఆర్య, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బన్నీ, బొమ్మరిల్లు, పౌర్ణమి, శంకర్ దాదా జిందాబాద్, తులసి, రెడీ, ఆర్య 2, మిస్టర్ పర్‌ఫెక్ట్, జులాయి, ఇద్దరమ్మాయిలతో, ఎవడు, ఎఫ్ 3, రంగరంగ వైభవంగా సినిమాలకు ప్లే బ్యాక్ సింగర్ గా పనిచేశాడు. సినిమా ఇండస్ట్రీలోకి రాక ముందు ఓ సింగింగ్ షోకు కూడా యాంకర్‌గా వ్యవహరించాడు సాగర్. ఇక పుష్ప 2, తండేల, ఉస్తాద్ భగత్ సింగ్, కంగువ తదితర క్రేజీ ప్రాజెక్టులతో బిజిబిజీగా ఉంటున్నాడు దేవిశ్రీ ప్రసాద్.
Singer @sagar_singer Dr.Mounica have been blessed with a baby boy yesterday ❤️
Congratulations 🎉 both couples 🧑🍼#Sagar #babyboy @santoshamsuresh pic.twitter.com/W6Dgs0olvS
— Suresh Kondeti (@santoshamsuresh) February 22, 2024
HAPPIEST 1st BDAY to my Brother @sagar_singer ‘s SON ,
My Dearest Cutest ‘BUDDI DADDY BOY’#VivaanDaksh 😍😍🤗🤗❤️❤️🎶🎶
🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂I also call him “BOMMA GAADU” coz he looks like a DOLL😍❤️
Need all ur Blessings & Love for him 🙏🏻
May all ur Dreams come True… pic.twitter.com/upbo3g0V8x
— DEVI SRI PRASAD (@ThisIsDSP) September 18, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి