Dethadi Harika Bigg Boss: బ్రాండ్‌ అంబాసిడర్‌పై స్పందించిన దేత్తడి హారిక.. ఇంతకీ తనేం చెప్పిందంటే..

|

Mar 11, 2021 | 3:39 PM

Dethadi Harika Bigg Boss: గత మూడు రోజులుగా దేత్తడి హారిక గురించి సోషల్‌ మీడియాతో పాటు న్యూస్‌ చానళ్లలో కూడా బాగా చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. యూట్యూబ్‌లో వెబ్‌ సిరీస్‌లు చేస్తూ యూత్‌కి బాగా కనెక్ట్‌ అయిన హారిక బిగ్‌బాస్‌...

Dethadi Harika Bigg Boss: బ్రాండ్‌ అంబాసిడర్‌పై స్పందించిన దేత్తడి హారిక.. ఇంతకీ తనేం చెప్పిందంటే..
Follow us on

Dethadi Harika Bigg Boss: గత మూడు రోజులుగా దేత్తడి హారిక గురించి సోషల్‌ మీడియాతో పాటు న్యూస్‌ చానళ్లలో కూడా బాగా చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. యూట్యూబ్‌లో వెబ్‌ సిరీస్‌లు చేస్తూ యూత్‌కి బాగా కనెక్ట్‌ అయిన హారిక బిగ్‌బాస్‌ సీజన్‌ 4తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. హౌజ్‌లో తనదైన అల్లరి పనులతో టాప్‌ 5లో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది.
హారికకు వచ్చిన ఈ ఫేమ్‌ను ఉపయోగించుకునే క్రమంలో తాజాగా మహిళా దినోత్సవం రోజున (మార్చి 8) హారికను తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (టీఎస్‌టీడీసీ)కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమిస్తూ ప్రకటన చేశారు. అయితే తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో.. తెలంగాణ ఎక్సైజ్‌, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హారిక ఎవరో తెలియదు అని చెప్పడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా దేత్తడి హారిక ట్విట్టర్‌ వేదికగా సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ (టీఎస్‌టీడీసీ) బ్రాండ్ అంబాసిడ‌ర్‌ పదవి నుంచి తాను తప్పుకుంటున్నట్టు హారిక ప్రకటించింది.

ఈ సందర్భంగా హారిక మాట్లాడుతూ.. ‘అందరికీ నమస్తే. ఒక చిన్న అప్‌డేట్.. మహిళా దినోత్సవం రోజు నన్ను టీఎస్‌టీడీసీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసిన విషయం, ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. కొన్ని కారణలతో నేను దానిని కొనసాగించలేకపోతున్నాను. నేను ఆ పదవి నుంచి తప్పుకుంటున్నాను. నాకు సపోర్ట్‌ చేసిన వారందరికీ ధన్యవాదాలు. దీని తర్వాత సిరీస్‌లపై నేను ఇంకా ఎక్కువ దృష్టి పెట్టనున్నాను. అందరూ దీనిని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు’ అంటూ ముగించింది. దీంతో అసలు హారికను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎందుకు నియమించారు.? ఎందుకు హారిక ఆ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది అన్న దానిపై ప్రస్తుతం సోషల్‌ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.

Also Read: ‘రాధేశ్యామ్’ నుంచి మరో అప్‏డేట్.. మహాశివరాత్రి కానుకగా అందమైన పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్..

Jati Ratnalu Movie: ‘జాతి రత్నాలు’ ట్విట్టర్ రివ్యూ: హిట్టు బొమ్మ.. కామెడీ అదుర్స్.. బ్లాక్‌బస్టర్ లోడింగ్.!