Vijay Deverakonda: సినిమా ప్లాఫ్ అంతే.. విజయ్ ఫెయిల్ అవ్వలా.. రౌడీ ఆన్‌ ఫుల్ డిమాండ్‌

లైగర్ మూవీ ఫ్లాప్ రౌడీ హీరో కెరీర్‌కు పెద్ద దెబ్బ అవుతుందని చాలామంది అభిప్రాయపడ్డారు. కానీ సీన్ అందుకు రివర్స్‌గా ఉంది. అతడి క్రేజ్ రోజురోజుకు పెరుగుతుంది.

Vijay Deverakonda: సినిమా ప్లాఫ్ అంతే.. విజయ్ ఫెయిల్ అవ్వలా.. రౌడీ ఆన్‌ ఫుల్ డిమాండ్‌
Vijay Deverakonda

Updated on: Nov 14, 2022 | 7:01 PM

లైగర్ ఎఫెక్ట్ విజయ్ దేవరకొండ కెరీర్ మీద అస్సలు కనిపించటం లేదు. ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న రౌడీ హీరో సినిమాలకు మంచి డిమాండ్‌ కనిపిస్తోంది. అదే సమయంలో కొత్త ప్రాజెక్ట్ విషయంలోనూ రౌడీ స్పీడు మాములుగా లేదన్న టాక్ వినిపిస్తోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేసిన పాన్ ఇండియా ప్రయత్నం ఫెయిల్ అయ్యింది. భారీ అంచనాల మధ్య రిలీజ్‌ అయిన లైగర్‌ బాక్సాఫీస్‌ దగ్గర అనుకున్న స్థాయిలో పర్ఫామ్‌ చేయలేదు. అయితే ఈ ఎఫెక్ట్ విజయ్‌ కెరీర్ మీద అస్సలు కనిపించటం లేదు. లైగర్ ఫెయిల్‌ అయినా విజయ్ అప్‌ కమింగ్ సినిమాలకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. ప్రజెంట్ సమంతతో కలిసి ఖుషి సినిమాలో నటిస్తున్నారు విజయ్‌. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ భారీగా జరుగుతోంది. దీనికి తోడు విజయ్‌తో సినిమా చేసేందుకు దర్శకులు క్యూ కడుతున్నారన్న న్యూస్‌ రౌడీ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది.

ఇప్పటికే విజయ్ దేవరకొండ చేతిలో రెండు మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కొత్తగా మరికొంత మంది దర్శకులు ఈ లిస్ట్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారన్నది నయా అప్‌డేట్‌. జెర్సీ ఫేమ్ గౌతమ్‌ తిన్ననూరి విజయ్‌ దేవరకొండతో ఓ స్పోర్ట్స్ డ్రామా ప్లాన్ చేస్తున్నారన్న టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారట రౌడీ హీరో.

తాజాగా విజయ్‌ కోసం వెయిటింగ్‌లో ఉన్న లిస్ట్‌లోకి మరో దర్శకుడు పేరు చేరింది. కాఫీ లాంటి చిత్రాలను రూపొందించే శేఖర్‌ కమ్ములతో విజయ్‌ దేవరకొండతో ఓ సినిమా చేయబోతున్నారట. గతంలో శేఖర్ సినిమాలో చిన్న రోల్‌ చేసిన విజయ్‌… ఇప్పుడు అదే డైరెక్టర్‌తో హీరోగా సినిమా చేసేందుకు రెడీ అవుతుండటం ఆసక్తికరంగా మారింది.

మరిన్ని టాలీవుడ్ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.