Deepthi Sunaina: వెక్కి వెక్కి ఏడ్చిన దీప్తి సునైనా.. కారణం అదేనా..?

|

Aug 24, 2024 | 3:06 PM

సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ బిగ్ బాస్ లో ఆఫర్ అందుకుంది. నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొంది. బిగ్ బాస్‌లో తన ఆటతోపాటు అందంతోనూ ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. అలాగే బిగ్ బాస్ లో టాస్క్ లో భాగంగా జుట్టు కూడా కత్తిరించుకుంది ఈ అమ్మడు.

Deepthi Sunaina: వెక్కి వెక్కి ఏడ్చిన దీప్తి సునైనా.. కారణం అదేనా..?
Deepthi Sunaina
Follow us on

సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది అందాల భామలు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. వారిలో దీప్తి సునైనా ఒకరు. ఈ అమ్మడు టిక్ టాక్ వచ్చిన దగ్గర నుంచి రకరకాల వీడియోలు చేస్తూ ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఇన్ స్టా గ్రామ్ రీల్ చేసి పాపులర్ అయ్యింది. ఆ క్రేజ్ తోనే పలు షార్ట్ ఫిలిమ్స్ చేసింది. ఇలా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ బిగ్ బాస్ లో ఆఫర్ అందుకుంది. నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొంది. బిగ్ బాస్‌లో తన ఆటతోపాటు అందంతోనూ ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. అలాగే బిగ్ బాస్ లో టాస్క్ లో భాగంగా జుట్టు కూడా కత్తిరించుకుంది ఈ అమ్మడు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన దీప్తి సునైనాకు సినిమాల్లో అవకాశాలు వస్తాయని అంతా అనుకున్నారు కానీ అలా జరగలేదు.

ఇది కూడా చదవండి : అబ్బో అబ్బో.. అబ్బబ్బో..! ఈ స్టార్ డైరెక్టర్ కూతుర్ని చూశారా.? హీరోయిన్స్ కూడా పనికిరారు.

అప్పుడెప్పుడో నిఖిల్ హీరోగా నటించిన కిరాక్ పార్టీ అనే సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. కానీ ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. రకరకాల ఫోటో షూట్స్ తో ప్రేక్షకులను మెప్పిస్తోంది. హీరోయిన్ కు ఏ మాత్రం తీసిపోని అందంతో ఆకట్టుకుంటోన్న దీప్తి సునైనా క్రేజీ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే ఈ అమ్మడు యూట్యూబర్ షణ్ముఖ్‌ను ప్రేమించిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ కలిసి చాలా వెబ్ సిరీస్ లు , సాంగ్స్ కూడా చేశారు. లవ్ లో ఉన్నప్పుడు దీప్తి అతని పేరులోని అక్షరాన్ని టాటూగా వేసుకుంది. బ్రేకప్ తర్వాత ఆ టాటూని కవర్ చేసింది.

ఇది కూడా చదవండి : ఏంటి ఈమె ప్రేమిస్తే హీరోయినా..? ఇలా మారిపోయిందేంటీ..! గుర్తుపట్టడం కష్టమే

ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఏది షేర్ చేసిన జెట్ స్పీడ్ తో వైరల్ అవుతున్నాయి. తాజాగా దీప్తి గోవా వెళ్ళింది. అక్కడ నుంచి కొన్ని ఫోటోలను పంచుకుంది. వాటిలో దీప్తి కన్నీళ్లు పెట్టుకుంటున్న ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. కళ్ళుమూసుకొని దీప్తి సునైనా ఏడుస్తున్న ఫోటో చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఏమైంది. ఎందుకు ఏడుస్తుంది.? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే అసలు మ్యాటర్ ఏంటంటే.. గోవాలో ఉన్న దీప్తి అక్కడ యోగాతో పాటు ఏరోబిక్స్, మార్షల్ ఆర్ట్స్ లో కూడా ట్రైనింగ్ చేస్తూ కనిపించింది. అందులో భాగంగా షేర్ చేసిన ఫొటోల్లోని ఇలా ఏడుస్తున్న ఫోటో కూడా ఉంది. బహుశా ఇది కూడా యోగాలో భాగమే అయ్యుంటుంది అంటున్నారు కొందరు నెటిజన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.