Deepthi Sunaina: కొత్తకారు కొన్న దీప్తి సునయన.. ప్రత్యేకతలు ఏంటో తెలుసా..
యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఫేమస్ కాగా.. అదే గుర్తింపుతో బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ లోనూ ఛాన్స్ కొట్టేసింది. ఈ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. బిగ్ బాస్ తర్వాత మళ్లీ షార్ట్ ఫిల్మ్స్, కవర్ సాంగ్స్ చేస్తూ బిజీగా బిజీగా ఉంటుంది. తాజాగా దీప్తి సునయన కొత్త కారు కొనుగోలు చేసింది. అయితే అందరిలాగా బెంజ్, ఆడి అంటూ లగ్జరీ బ్రాండ్స్ కాకుండా డిఫరెంట్ కారు కొనుగోలు చేసింది. టాయోోటాలో హై లక్స్ అనే వాహనాన్ని కొనుగోలు చేసింది. అలాగే ఈ వాహనంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.
![Deepthi Sunaina: కొత్తకారు కొన్న దీప్తి సునయన.. ప్రత్యేకతలు ఏంటో తెలుసా..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/04/deepthi-sunaina.jpg?w=1280)
దీప్తి సునయన.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. సోషల్ మీడియాలో ఆమె పేరు నిత్యం ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఒకప్పుడు డబ్స్మాష్ వీడియోస్ చేస్తూ పాపులర్ అయ్యింది. ఇక ఆ తర్వాత టిక్ టాక్ వీడియోస్.. యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఫేమస్ కాగా.. అదే గుర్తింపుతో బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ లోనూ ఛాన్స్ కొట్టేసింది. ఈ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. బిగ్ బాస్ తర్వాత మళ్లీ షార్ట్ ఫిల్మ్స్, కవర్ సాంగ్స్ చేస్తూ బిజీగా బిజీగా ఉంటుంది. తాజాగా దీప్తి సునయన కొత్త కారు కొనుగోలు చేసింది. అయితే అందరిలాగా బెంజ్, ఆడి అంటూ లగ్జరీ బ్రాండ్స్ కాకుండా డిఫరెంట్ కారు కొనుగోలు చేసింది. టాయోోటాలో హై లక్స్ అనే వాహనాన్ని కొనుగోలు చేసింది. అలాగే ఈ వాహనంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.
ఈ వాహనం స్పెషాలిటీ ఏమిటంంటే డ్రైవర్ తోపాటు మరో ముగ్గురు ఏసీ క్యాబిన్లో కూర్చొవచ్చు. అలాగే వెనక లగేజీ పెట్టుకోవడానికి స్పేస్ ఉంటుంది. ఇలాంటి వాహనాలను ఫారెన్ లో క్యారవాన్లుగా మార్చుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. అలాగే ఈ వాహనం బేసిక్ మోడల్ దాదాపు రూ. 30 లక్షలు ఉంటుంది.. ఇక హై ఎండ్ మోడల్ అయితే రూ.37 లక్షల వరకు ఉంటుంది. దీప్తికి ఇప్పుడు ఇలాంటి వాహనంతో ఏంటీ పని ?.. ఎందుకు తీసుకుంది ఇలాంటి ప్రత్యేక వాహనం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే దీప్తి సునయనకు ఫ్యాన్స్ విషెస్ తెలుపుతున్నారు.
ఇదిలా ఉంటే.. దీప్తి సునయనకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్ స్టాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఫోటోషూట్స్, రీల్స్ చేస్తూ సందడి చేస్తుంటుంది. ఇక ఆమె చేసే కవర్ సాంగ్స్ యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో ట్రెండ్ అవుతుంటాయి. షార్ట్ ఫిల్మ్స్, టిక్ టాక్ వీడియోస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న దీప్తి.. యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ తో ప్రేమ, బ్రేకప్ గురించి అందరికి తెలిసిందే.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.