Deepika Padukone: దీపికా అరుదైన ఘనత.. వందమందిలో నెంబర్ వన్ స్టార్

ఇప్పుడు దీపికా పదుకొణె మరో ఘనత సాధించింది. ఐఎమ్‌డీబి రిలీజ్ చేసిన టాప్ 100 భారతీయ సెలబ్రిటీల జాబితాలో దీపికా పదుకొణె నంబర్ 1 స్థానాన్ని పొందింది. షారూఖ్ ఖాన్ , అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి ప్రముఖ తారలను దీపిక అధిగమించింది. తమ అభిమాన నటికి లభిస్తున్న ఆదరణ చూసి అభిమానులు ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. 

Deepika Padukone: దీపికా అరుదైన ఘనత.. వందమందిలో నెంబర్ వన్ స్టార్
Deepika Padukone

Updated on: May 29, 2024 | 6:58 PM

బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లిస్ట్‌లో మొదటి ప్లేస్‌లో ఉండే బ్యూటీ దీపికా పదుకొణె. హాట్ బ్యూటీ దీపికా పదుకొణె చాలా ఏళ్లుగా సినిమాల్లో రాణిస్తుంది. ఈ అమ్మడి నటనకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇప్పుడు దీపికా పదుకొణె మరో ఘనత సాధించింది. ఐఎమ్‌డీబి రిలీజ్ చేసిన టాప్ 100 భారతీయ సెలబ్రిటీల జాబితాలో దీపికా పదుకొణె నంబర్ 1 స్థానాన్ని పొందింది. షారూఖ్ ఖాన్ , అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి ప్రముఖ తారలను దీపిక అధిగమించింది. తమ అభిమాన నటికి లభిస్తున్న ఆదరణ చూసి అభిమానులు ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

ఏప్రిల్ 2014 నుంచి ఏప్రిల్ 2024 వరకు ఐఎమ్‌డీబి వెబ్‌సైట్‌లో అత్యధికంగా సర్చ్ చేసిన ప్రముఖుల ప్రొఫైల్ ఆధారంగా ఈ జాబితా తయారు చేశారు. ఐఎమ్‌డీబి వెబ్‌సైట్‌లోసినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు చాలా మంది సెలబ్రెటీల ప్రొఫైల్స్ కూడా ఉన్నాయి. ఈ క్రమంలో దీపికా పదుకొనే పేజీని ఎక్కువ మంది సర్చ్ చేసి చూశారట.

మొదటి స్థానంలో దీపికా పదుకొణె ఉండగా, రెండో స్థానంలో షారూఖ్ ఖాన్ ఉన్నారు. ఐశ్వర్యరాయ్ బచ్చన్ మూడో స్థానంలో నిలిచారు. అలియా భట్ 4వ స్థానంలో ఉంది. ఇర్ఫాన్ ఖాన్ 5వ స్థానంలో నిలిచాడు. అమీర్ ఖాన్ 6వ స్థానంలో ఉన్నాడు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 7వ స్థానంలో నిలిచాడు. సల్మాన్ ఖాన్ 8వ స్థానంలో, హృతిక్ రోషన్ 9వ స్థానంలో, అక్షయ్ కుమార్ 10వ స్థానంలో ఉన్నారు. వీరితో పాటు మన స్టార్ హీరోయిన్ సమంత పదమూడో స్థానంలో ఉన్నారు. అలాగే కన్నడ స్టార్ హీరో యష్ 89వ ర్యాంక్‌లో ఉన్నాడు. దీపికా పదుకొణె ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఇటీవలే పఠాన్ సినిమాతో భారీ హిట్ అందుకుంది. అలాగే జవాన్, ఫైటర్ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం తన మొదటి బిడ్డ రాక కోసం ఎదురుచూస్తున్న ఈ బ్యూటీ సినిమా ప్రమోషన్స్ కు బ్రేక్ ఇచ్చింది. ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’తోపాటు ‘సింగం ఎగైన్’ సినిమాల్లో నటించింది దీపికా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.