AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీ శరీరం నీఇష్టం అని అన్నాడు.. ఆ మాటలు నాకు ధైర్యాన్ని నింపాయి: దీపికా పదుకొణె

బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం తల్లిగా తన బిడ్డతో కలిసి సదదాగా గడుపుతుంది దీపికా. 2006లో ఐశ్వర్య సినిమాతో కన్నడ సినీరంగంలోకి అడుగుపెట్టింది దీపికా..కన్నడ సినిమాతోనే సినీ ప్రయాణం స్టార్ట్ చేసిన దీపికా.. షారుఖ్ ఖాన్ సరసన ఓం శాంతి ఓం మూవీ హిందీ సినీపరిశ్రమలోకి అడుగుపెట్టింది

నీ శరీరం నీఇష్టం అని అన్నాడు.. ఆ మాటలు నాకు ధైర్యాన్ని నింపాయి: దీపికా పదుకొణె
Deepika Padukone
Follow us
Rajeev Rayala

|

Updated on: May 08, 2025 | 6:02 PM

దీపికా పదుకొణె ఇప్పుడు బాలీవుడ్‌లో నంబర్ 1 స్టార్ హీరోయిన్. ఇక కల్కి సినిమాతో దక్షిణాదిలోనూ ఆమెకు క్రేజ్ బాగా పెరిగిపోయింది. హాలీవుడ్ సినిమాల్లో నటించి మెప్పించిన దీపిక ఇప్పుడు సినిమా షూటింగులకు కాస్త విరామం ఇచ్చింది. కొన్ని రోజుల క్రితం పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆమె ఇప్పుడు తన కూతురు ఆలనా పాలనలో బిజీ బిజీగా ఉంటోంది. దీంతో బయట కూడా పెద్దగా కనిపించడం లేదీ అందాల తార. బిలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ చిన్నది. త్వరలోనే తిరిగి సినిమాల్లో బిజీగా మారనుంది. 2018లో రణవీర్ సింగ్, దీపికా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దాదాపు ఆరేళ్ళ తర్వాత అంటే 2024లో ఈ జంట బిడ్డకు జన్మనిచ్చారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దీపికా.. పిల్లల్ని కనడం పై ఆసక్తికర కామెంట్ చేసింది. పిల్లల్ని కనడానికి ఎందుకు టైం తీసుకుందో కూడా వివరించింది దీపికా. దీపికా మాట్లాడుతూ.. పెళ్ళైన కొత్తలో పిల్లల్ని ఎప్పుడు ప్లాన్ చేద్దాం అని నేను రణవీర్ ను అడిగాను. దానికి అతను చెప్పిన సమాధానం నాకు ఎంతో దైర్యం ఇచ్చింది. పిల్లల్ని కనడం అనేది ఇద్దరి నిర్ణయం అయినా.. పిల్లని మోసేది నువ్వు.. నువ్వు ఎప్పుడు కోరుకుంటే అప్పుడే ప్లాన్ చేద్దాం.. బేబీ పెరిగేది నీ బాడీలో.. నువ్వు ఎప్పుడు పిల్లల్ని కనగలను అని అనుకుంటే అప్పుడే ప్లాన్ చేద్దాం అని అన్నాడు. ఆ మాటలు నాలో  ధైర్యాన్ని నింపాయి.

అలాగే పాప పుట్టిన తర్వాత పేరు పెట్టడానికి మేము తొందరపడలేదు.. రెండు నెలలు టైం తీసుకున్నాము.. పాపకు దువా అనే పేరు అనుకోకుండా పెట్టాం.. దువా అంటే అరబిక్ లో ప్రార్ధన అని అర్ధం. బేబీ పేరు గురించి చర్చిస్తూ ‘దువా’ అన్నాను వెంటనే రణవీర్ ఓకే బాగుంది ఇదే పెడదాం అన్నాడు. అలా పేరు పెట్టేశాం. మా ప్రార్థనలకు సమాధానమే ఈ పాప అని అని అర్ధం వచ్చేలా పేరు పెట్టాం అని దీపికా చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.