ఆమె వాలు కళ్ల వయ్యారి.. కుర్రకారు కలల రాణి. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసే నటి. అవే కళ్లలో రౌధ్రాన్ని ప్రదర్శించడం.. రొమాన్స్ చూపించడం ఆమె స్పెషాలిటీ. ఇప్పటికే మీకు అర్థమయ్యి ఉంటుంది.. మేము మాట్లాడుతుంది… బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె గురించి అని. ఈ బ్యూటీ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో సందడి చేసింది. స్టైలిష్ లుక్‌లో కిర్రాక్ అనిపించేలా మెస్మరైజ్ చేసింది. ఇంకో న్యూస్ ఏంటంటే… ఈ క్రేజీ బ్యూటీ అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లు సమాచారం. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఆమె దిగిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. దీపికా పదుకొనె.. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న ‘ప్రాజెక్ట్ కె’ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ కోసమే ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది.
కాగా, ఈ మూవీలో, దీపికతో పాటు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీ రోల్ పోషిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్‌ను కొంత కాలం క్రితం ప్రారంభించి బిగ్‌బీపై ఇంపార్టెంట్ సీన్స్ షూట్ చేశారు. ఇక ప్రభాస్.. నటించిన ‘రాధేశ్యామ్’ షూటింగ్ కూడా పూర్తయింది. దీంతో ‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్ మళ్లీ ప్రారంభంకానుందన్న చర్చ జరుగుతుంది. డిసెంబరు 5 నుంచి దీపిక షూట్‌లో పాల్గొంటారని సమాచారం. 7న ప్రభాస్ కూడా షూట్‌లో జాయిన్ అవుతారని తెలుస్తోంది.
దీపిక పదుకొనె.. త్వరలోనే ’83’ మూవీతో ప్రేక్షకుల పలకరించబోతుంది. దీంతో పాటు రణ్వీర్ సింగ్‌తో ‘సర్కస్’, షారుక్‌తో ‘పఠాన్’ సినిమాల్లోనూ నటిస్తోంది. ఇక ప్రభాస్ ‘రాధేశ్యామ్’ జనవరి 14న విడుదల కానుంది.
Also Read: Raai Laxmi-Dhoni: ‘ధోనితో అందుకే బ్రేకప్’.. ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసిన రాయ్ లక్ష్మీ
ఈ ఫోటోలోని టీనేజర్ ఇప్పుడు డిజిటల్ ప్రపంచాన్ని శాసిస్తున్నాడు.. ఎవరో గుర్తుపట్టారా..?