David Warner: మరోసారి అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్న వార్నర్.. డేవిడ్ పుష్ప అంటున్న నెటిజన్స్

మొదటి పార్ట్ భారీ విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు పుష్ప 2 పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే ఆ అంచనాలు ఆకాశానికి చేర్చేలా రీసెంట్ గా గ్లింమ్ల్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

David Warner: మరోసారి అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్న వార్నర్.. డేవిడ్ పుష్ప అంటున్న నెటిజన్స్
David Warner, Allu Arjun

Updated on: Apr 21, 2023 | 3:18 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప 2 సినిమా కోసం ప్రేక్షకులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. బన్నీ మాస్ గెటప్‌కు ఆయన యాక్షన్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మొదటి పార్ట్ భారీ విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు పుష్ప 2 పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే ఆ అంచనాలు ఆకాశానికి చేర్చేలా రీసెంట్ గా గ్లింమ్ల్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అలాగే అల్లు అర్జున్ అమ్మవారి గెటప్ లో ఉన్న ఫోటోను కూడా రిలీజ్ చేశారు. దాంతో సినిమా పై ఎక్స్పెటెషన్స్ నెక్ట్స్ లెవల్ కు వెళ్లాయి. బన్నీని అమ్మవారి గెటప్ లో చూసిన అభిమానులు పూనకాలతో ఊగిపోయారు.

తాజాగా ఈ ఫోటోను మార్ఫింగ్ చేశాడు ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్.వార్నర్ ఇలా చేయడం తొలిసారి కాదు. గతంలో  అల్లు అర్జున్ చేసిన సినిమాల పాటలు డాన్స్ చేసిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు వార్నర్. బన్నీ అలవైకుంఠపురంలో సినిమా సమయంలో వార్నర్ ఆ మూవీ పాటలకు స్టెప్పులేసి ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాడు.

అలాగే బన్నీ గెటప్ ను మార్ఫింగ్ చేసిన ఫోటోలను కూడా పంచుకున్నాడు. తాజాగా పుష్ప 2 గెటప్ లో కనిపించి అభిమానులను థ్రిల్ అయ్యేలా చేశాడు. అమ్మవారి గెటప్ లో బన్నీ ఫోటోను తల మార్చి వార్నర్ తలను మార్ఫ్ చేశారు. అలాగే దానికి టైటిల్ పుష్ప 3 అని ఉంది. ఆ ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దాంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..