Dasari Narayana Rao: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆయన ఓ ధ్రువ తార.. ఎందరో దర్శకులకు ఆయన మార్గదర్శి. ఆయనే దర్శక రత్న.. దర్శక దిగ్గజం దాసరి నారాయణ రావు. దర్శకుడిగా నటుడిగా తెలుగు సినిమా పై తనదైన ముద్రను వేశారు దాసరి. కమర్షియల్ సినిమాలనే కాదు విప్లవ జ్వాలను రగిలించే సినిమాలు తీయడంలోనూ దాసరి దిట్ట. నేడు ఆ దర్శక శిఖరం జయంతి. దాసరి నారాయణ రావు భౌతికంగా మనమధ్య లేకపోయినా తెలుగు సినిమా ఉన్నంతవరకు ఆయన కీర్తి ఉంటుంది. మే 4న 1947లో పాలకొల్లులో అతిసామాన్యమైన కుటుంబంలో జన్మించిన దాసరి.. ‘విన్న పదం సినిమా.. కన్న కల సినిమా.. నడిచిన బాట సినిమా.. ఆడిన ఆట సినిమా..’
దాసరి చిన్న తనంలో ఎన్నో ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. చదువుకు డబ్బులు లేక మానేసి పనికి కూడా వెళ్లారు. ఆ తర్వాత స్వతహాగా ఎదుగుతూ.. అనతి కాలంలోనే ప్రతిభ గల రంగ స్థల నటుడిగా, నాటక రచయితగా చిత్ర దర్శకుడిగా గుర్తింపు పొందారు. అనంతరం అత్యధిక చిత్రాల దర్శకుడుగా గిన్నిస్ పుటలకెక్కారు. ఆయన దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 53 సినిమాలు స్వయంగా నిర్మించారు. ఈయన 250 పైగా చిత్రాలలో సంభాషణ రచయితగా లేదా గీతరచయితగా పనిచేశారు. మామగారు, సూరిగాడు , ఒసేయ్ రాములమ్మా చిత్రాలు దాసరి నటనా కౌశలానికి మచ్చుతునకలు. తెలుగు , కన్నడ సినిమాల్లో నటుడిగాను గుర్తింపు పొందిన ఆయన ఉత్తమ నటునిగా బహుమతి కూడా పొందారు. దాసరి సినిమాల్లో తాతా మనవడు, స్వర్గం నరకం, మేఘసందేశం, మామగారు వంటి సినిమాలు ఆయనకు అనేక అవార్డులు తెచ్చిపెట్టాయి. నా అన్నవాళ్లను అక్కున చేర్చుకుని వారికి ఉపాధి కల్పించారు. వందలాది మంది ఆర్టిస్టుల్ని టెక్నీషియన్లను పరిశ్రమకు పరిచయం చేసిన గొప్ప వ్యక్తి దాసరి. తెలుగు సినిమా పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉన్న దాసరి నారాయణ రావు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ సికిందరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో 2017 మే 30న తుది శ్వాస విడిచారు.
మరిన్ని ఇక్కడ చదవండి :