Kondapolam: కొండపొలం నుంచి మరో సాంగ్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న దారులు దారులు లిరిక్స్..

|

Oct 03, 2021 | 9:27 AM

మెగా యంగ్ హీరో వైష్ణవ్ తేజ్.. రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా కొండపొలం. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా..

Kondapolam: కొండపొలం నుంచి మరో సాంగ్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న దారులు దారులు లిరిక్స్..
Kondapolam
Follow us on

మెగా యంగ్ హీరో వైష్ణవ్ తేజ్.. రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా కొండపొలం. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా.. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‎టైన్మెంట్ బ్యానర్ పై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తిచేసుకున్న ఈ మూవీని అక్టోబర్ 8న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాయి.

తాజాగా ఈ సినిమా నుంచి దారులు దారులు అనే లిరికల్ సాంగ్ విడుదల చేశారు మేకర్స్. దారులు దారులు దారులు.. పులి చారలు చారలు చారలు.. సాగాక తప్పని దారులు.. ఏ జాడని తీరులు.. మెతుకుని వేతికే ఆశల మూరలు బతుకుని కోరికే ఆకలి కోరలు… చావో రేవో తేలెవరకు ఆగకన్న పోలిమేరలు… అంటూ సాగే ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటుంది. బతకడం చేసే పోరాటం నేపథ్యంలో ఈ సాంగ్ సాగినట్టుగా తెలుస్తోంది. ఈ ఈ పాటకు ఎంఎం కీరవాణీ బాణీలు అందించగా.. సిరివెన్నెల సీతరామశాస్త్రి రచించారు. ఈపాటను ఎంఎం కీరవాణి, హరిక నారాయణ్ ఆలపించారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో గొర్రెల కాపరిగా వైష్ణవ్ తేజ్ కనిపిస్తారు.

వీడియో..

Also Read: Bathukamma Song: తెలంగాణ గౌరమ్మ కోసం దిగివస్తున్న సంగీత దిగ్గజాలు. ఈసారి అంతర్జాతీయ స్థాయిలో బతుకమ్మ పాట..

Kangana: నాగ చైతన్య, సమంత విడిపోవడానికి ఆ బాలీవుడ్‌ స్టారో హీరోనే కారణం.. కంగనా సెన్సేషన్ కామెంట్స్‌.

Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ ట్విస్ట్ మాములుగా లేదు.. ఈరోజు ఎలిమినేట్ అయ్యేది ఆ కంటెస్టెంటే..

Shyam Singha Roy: శ్యామ్ సింగరాయ్‏తో నాని భారీ ప్లాన్.. పాన్ ఇండియా దిశగా కసరత్తులు చేస్తోన్న న్యాచురల్ స్టార్..