ఇండియాలో మోస్ట్ బిజియెస్ట్.. కాస్ట్‌లీయెస్ట్ హీరో ప్రభాస్. ఒక్కో సినిమాకు 100 కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్న ఈయన.. ప్రస్తుతం 8 సినిమాలతో బిజీగా ఉన్నారు. కొన్ని నిర్మాణ సంస్థలు 150 కోట్లు ఇస్తామని ముందుకొస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న ప్రభాస్.. టాలీవుడ్‌లో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకునే హీరో. అయితే దానికంటే ఎగ్జైటింగ్ విషయం మరోటి ఏంటంటే.. మల్టీస్టారర్స్‌లో ఎక్కువగా భాగం అవుతున్నారు రెబల్ స్టార్. ప్రతీ సినిమాలోనూ మరో ఇండస్ట్రీ స్టార్స్‌తో కలిసి నటిస్తున్నారు ప్రభాస్. సలార్‌లోనూ ఇదే జరుగుతుంది. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోనే జరుగుతుంది. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నారు. మరోవైపు కేజియఫ్ స్టార్ యశ్ సైతం సలార్‌లో అతిథి పాత్రలో మెరుస్తారనే ప్రచారం జరుగుతుంది. ఇక నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ Kలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
సలార్, ప్రాజెక్ట్ K సినిమాలు మాత్రమే కాదు.. ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో చాలా వరకు మల్టీస్టారర్స్ ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఆదిపురుష్ షూటింగ్ పూర్తి చేసుకుంది.. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక సలార్ సెప్టెంబర్ 28న విడుదల కానుంది. ఇక నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ K 2024 ఫస్ట్ హాఫ్‌లోనే విడుదల కానుంది. వీటి తర్వాత సందీప్ రెడ్డి వంగా స్పిరిట్.. మైత్రి మూవీ మేకర్స్ సినిమాలు లైన్‌లో ఉన్నాయి.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కబోయే సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకుడు. తాజాగా షారుక్ ఖాన్ పఠాన్‌తో వస్తున్న ఈ దర్శకుడు.. త్వరలోనే ఫైటర్ సినిమాతో రానున్నారు. వీటి తర్వాత ప్రభాస్ సినిమా ఉండబోతుంది. అందులో హృతిక్ రోషన్ మరో హీరోగా నటించే అవకాశాలున్నాయి. నిజంగానే ప్రభాస్, హృతిక్ కాంబినేషన్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్ వస్తే ఫ్యాన్స్‌కు పండగే. చూడాలిక ఏం జరగబోతుందో..?
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..