Actor Dhanush : విభిన్నమైన సినిమాలతో తన వర్సటైల్ యాక్టింగ్ తో పాన్ ఇండియా రేంజ్‌లో పాపులర్ అవుతున్న హీరో ధనుష్. ఈ యంగ్ హీరో స్టార్ హీరో అయినప్పటికీ చిన్న దర్శకులతో సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నాడు. అంతే కాదు తన అద్బుతమైన నటనతో ఎన్నో అవార్డులు కూడా సొంతం చేసుకుంటున్నాడు ధనుష్. ఈ కుర్ర హీరో ఇప్పుడు స్టార్ హీరో దళపతి విజయ్‌ను ఫాలో అవుతున్నారు. విజయ్ లాగే తాను కూడా స్ట్రెయిట్గానే రచ్చ గెలుస్తానని అంటున్నారు. రీసెంట్‌గా జగమే తంత్రం సినిమాను ఓటీటీ వేదికగా రిలీజ్ కు సిద్దం చేసిన ధనుష్… స్టార హీరో విజయ్ లాగే ఓ స్ట్రెయిట్ తెలుగు మూవీ చేయబోతున్నారట. ఇప్పుడిదే విషయం అటు కోలీవుడ్ లోనూ.. ఇటు టాలీవుడ్లోనూ వైరల్ గా మారింది. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ, స్టార్ డైరెక్టర్ కాంబినేషన్‌లో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నారట. ఆ సినిమాలో హీరోగా ధనుష్ నటిస్తే బాగుంటుందని భావించి ఈ యంగ్ హీరోని సంప్రదించారట.
ఇక మంచి కథ దొరికితే టాలీవుడ్లోకి నేరుగా ఎంట్రీ ఇద్దామని ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ధనుష్ కూడా.. వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం ఇష్టం లేక ఓకే చెప్పేశారట. ఇక వచ్చే ఏడాదిలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళనుందని ఇండస్ట్రీలో టాక్ కూడా వినిపిస్తోంది. ఈ న్యూస్ ఎంత వరకు నిజమవుతుందో ముందు ముందు చూడాలి మరి!
మరిన్ని ఇక్కడ చదవండి :