AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విషాదం.. లవ్ ఫెయిల్యూర్ కావడంతో డాన్స్ మాస్టర్ ఆత్మహత్య..

హైదరాబాద్‌లోని మియాపూర్‌లో డాన్స్ మాస్టర్ సాగర్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ వైఫల్యం కారణంగా డాన్స్ మాస్టర్ సాగర్ కుమార్ (17) ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సాగర్ కుమార్ మియాపూర్‌లోని గోకుల్ ఫ్లాట్స్‌లో ఉన్న డిలైట్ డాన్స్ స్టూడియోలో పనిచేస్తున్నాడు.

విషాదం.. లవ్ ఫెయిల్యూర్ కావడంతో డాన్స్ మాస్టర్ ఆత్మహత్య..
Sagar Kumar
Rajeev Rayala
|

Updated on: May 27, 2025 | 6:50 PM

Share

సినిమా ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేస్తున్నాయి. తాజాగా ఓ డాన్స్ మాస్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని మియాపూర్‌లో డాన్స్ మాస్టర్ సాగర్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ వైఫల్యం కారణంగా డాన్స్ మాస్టర్ సాగర్ కుమార్ (17) ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సాగర్ కుమార్ మియాపూర్‌లోని గోకుల్ ఫ్లాట్స్‌లో ఉన్న డిలైట్ డాన్స్ స్టూడియోలో పనిచేస్తున్నాడు. డాన్స్ మాస్టర్ గా తన ప్రతిభను చాటుకున్నాడు సాగర్. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే సాగర్ ఆత్మహత్య చేసుకోవడం అందరిని కలిచివేస్తుంది.

ఇది కూడా చదవండి : అప్పుడు స్టార్ హీరోలు నాకోసం ఎదురుచూసేవారు.. కానీ ఇప్పుడు అవకాశాలు ఇవ్వడంలేదు..

మే 26, 2025 రాత్రి, సాగర్ స్టూడియోలోని ఒక గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమలో విఫలమై మనస్తాపం ఈ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. డాన్స్ అకాడమీ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.

ఇది కూడా చదవండి : చిన్నవయసులోనే ప్రేమలో పడింది.. పెళ్లికోసం మతం మార్చుకుంది.. 18ఏళ్లకు దారుణమైన చావు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి