ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటనలో విచారణకు హాజరయ్యాడు. చిక్కడపల్లి పోలీసులు ఎలాంటి ప్రశ్నలు సంధిస్తున్నారు? ఏయే అంశాలపై స్టేట్‌మెంట్ రికార్డ్ చేస్తున్నారన్న ఉత్కంఠ మొదలైంది. సరిగ్గా ఆ సమయంలో పుష్ప-2 నుంచి సాంగ్ రిలీజ్ అయింది. పుష్ప-2 మూవీ బాక్సాఫీస్ దుమ్ము దులుపుతోంది. రికార్డ్‌ల మీద రికార్డ్‌లు సాధిస్తూ హిస్టరీ క్రియేట్ చేస్తోంది. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 1500కోట్లు రాబట్టింది. ఒక్క హిందీలోనే 700ల కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ జోష్ మరింత రెట్టింపు చేస్తూ దమ్ముంటే పట్టుకోరా సాంగ్‌ను రిలీజ్ చేసింది పుష్ప టీమ్. పుష్ప-2లో ఫహద్ ఫాజిల్ పోషించిన సాలిడ్ రోల్ భన్వర్ సింగ్ షెకావత్‌కి ఛాలెంజ్ విసురుతూ.. దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు అని హీరో మాస్ డైలాగ్ ఉంటుంది. నిజానికి సినిమా చూసిన వాళ్లంతా ఈ డైలాగ్‌ను సాంగ్ రూపంలో వదలాలని కోరుతున్నారు. దీంతో ఈ ట్రాక్‌ని పాన్ ఇండియా భాషల్లో అఫీషియల్‌గా రిలీజ్ చేశారు మేకర్స్.
యూట్యూబ్‌లో సాంగ్ రిలీజైన కొద్ది గంటల్లోనే లక్షల వ్యూస్‌లతో దూసుకుపోతుంది. పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. మలయాళ సూపర్ స్టార్ ఫహద్ ఫాజల్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించారు. అలాగే జగపతిబాబు, సునీల్, అనసూయ, రావు రమేష్ తదితరులు కీ రోల్స్ పోషించారు. ఇక డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల ఒక స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది. డిసెంబర్ 05న విడుదలైన పుష్ప 2 సినిమా ఇప్పటికే రూ. 1700 కోట్లకు చేరువలో ఉంది. ఒక్క హిందీ లోనే అల్లు అర్జున్ సినిమాకు రూ. 700 కోట్లకు పైగా కలెక్షన్లు రావడం విశేషం. లాంగ్ రన్ లో ఇది 1000 కోట్లను దాటే అవకాశముందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. అలాగే ఓవరాల్ కలెక్షన్లు కూడా రూ.2000 కోట్లను అధిగమించవచ్చని అంచనా వేస్తున్నారు.
Experience the WILDFIRE in 3D 🤩#Pushpa2TheRule Hindi version now playing in 3D across the country 💥💥
Book your tickets now!
🎟️ https://t.co/tHogUVEOs1#Pushpa2#WildFirePushpaIcon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @resulp @NavinNooli… pic.twitter.com/rgEsPGfg6H
— Mythri Movie Makers (@MythriOfficial) December 24, 2024