
స్టార్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక ఇటీవలే వివాహబంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 26న రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి పెళ్లి వేడుక అత్యంత అట్టహాసంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు, సినీ ప్రముఖుల ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు.ఇక ఈ గ్రాండ్ వెడ్డింగ్ తర్వాత కూడా బిజీ బిజీగా గడిపారు కొత్త దంపతులు. అలాగే విజయ్, రష్మిక టీమ్ దేశవ్యాప్తంగా పలు చోట్ల స్వీట్లు పంపిణీ , అదేవిధంగా దేవాలయాల వద్ద అన్నదాన కార్యక్రమాలు, అలాగే హైదరాబాద్ లో అభిమానులకు బంతి భోజనాలు ఏర్పాటు చేశారు. అలాగే రష్మిక, విజయ్ రిసెప్షన్ కూడా ఎంతో గ్రాండ్ గా జరిగింది.
అయితే విజయ్, రష్మిక పెళ్ళికి తనను ఎందుకు పిలవలేదు అంటూ ఓ చిన్నారి మొనీమధ్య చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ చిన్నారి తన ముద్దు ముద్దు మాటలతో అడిగిన ప్రశ్నలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. విజయ్ దేవరకొండ-రష్మికలు పెళ్లి చేసుకున్నారు కదా.. మేం కూడా మీ ఫ్యాన్స్‌మే కదా.. మరి మమ్మల్ని పెళ్లికి ఎందుకు పిలవలేదు.? అందరికీ లడ్డూలు ఇస్తున్నారు, అన్నదానం చేస్తున్నారు.. మేం కూడా మీ కోసం సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలు చేస్తున్నాం కదా.! మమ్మల్ని పిలిస్తే ఏమవుతుందంట.? ఈ వీడియో వారికి తెలిసేలా షేర్ చేయండి. అంటూ వీడియో చేసింది ఆ చిన్నారి.
ఆ చిన్నారి వీడియో వైరల్ అవ్వడంతోపాటు అది విజయ్, రష్మిక వరకు చేరింది. దాంతో విరోష్ జంట ఆ పాపను కలిశారు. ఆ చిన్నారిని ఇంటికి పిలిచి స్వయంగా తమ చేతులతో ఆ చిన్నారికి వడ్డించారు విరోష్ జంట. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భోజనం తర్వాత ఆ చిన్నారితో విజయ్, రష్మిక ముచ్చటించారు. ఆ చిన్నారి క్యూట్ మాటలకూ విజయ్, రష్మిక తెగ నవ్వుకున్నారు. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
Finally! the Cute little Fan met #VIROSH for Lunch!❤️🥰😂 pic.twitter.com/ijcmCVzzUm
— Movies4u Official (@Movies4u_Officl) March 20, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.