Yatra 2 Movie: యాత్ర 2 పై రోజురోజుకు పెరుగుతున్న క్యూరియాసిటీ.. హీరో అతడేనా..

నయా చాప్టర్స్ మీద క్యూరియాసిటీ మాత్రం రోజు రోజుకీ పెరుగుతోంది. ఇప్పుడు అలాంటి ఫోకస్‌ యాత్ర2 మీద గట్టిగా ఉంది. యాత్ర2 సినిమా చేస్తారనే టాక్‌ వచ్చినప్పటి నుంచీ హీరో ఎవరు? ఈ సారి మెయిన్‌ స్టోరీగా ఏ ఎపిసోడ్‌ తీసుకుంటారంటూ ఆసక్తి మొదలైంది జనాల్లో.

Yatra 2 Movie: యాత్ర 2 పై రోజురోజుకు పెరుగుతున్న క్యూరియాసిటీ.. హీరో అతడేనా..
Yatra 2

Edited By:

Updated on: Jul 17, 2023 | 12:20 PM

ఇప్పుడు సెట్స్ మీదున్న సినిమాల్లో ఫ్రెష్‌ మూవీస్‌ ఎన్ని ఉన్నాయో, సీక్వెల్స్ కూడా అన్నే ఉన్నాయి. ఆల్రెడీ తెలిసిన కథే అయినా, చెప్పిన కథకు కొనసాగింపే అయినా, నయా చాప్టర్స్ మీద క్యూరియాసిటీ మాత్రం రోజు రోజుకీ పెరుగుతోంది. ఇప్పుడు అలాంటి ఫోకస్‌ యాత్ర2 మీద గట్టిగా ఉంది. యాత్ర2 సినిమా చేస్తారనే టాక్‌ వచ్చినప్పటి నుంచీ హీరో ఎవరు? ఈ సారి మెయిన్‌ స్టోరీగా ఏ ఎపిసోడ్‌ తీసుకుంటారంటూ ఆసక్తి మొదలైంది జనాల్లో. ఇటీవల యాత్ర 2 మోషన్‌ పోస్టర్‌ రిలీజ్‌ టైమ్‌లో దీనికి సంబంధించి ఫుల్‌ క్లారిటీ ఇచ్చేశారు కెప్టెన్‌ మహి. వి. రాఘవ్‌. వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి ఎదుగుదలను పొలిటికల్‌ డ్రామాగా చూపిస్తామని చెప్పారు.

జగన్‌ మోహన్‌రెడ్డి పాత్రలో కోలీవుడ్‌ హీరో జీవా నటిస్తారనే మాట ఆల్రెడీ ప్రచారంలో ఉంది. మోషన్‌ పోస్టర్‌ చూసిన వారందరూ జీవానే ఊహించుకున్నారు. అయితే లేటెస్ట్ గా జగన్‌ రోల్‌ కోసం లుక్‌ టెస్ట్, కాస్ట్యూమ్స్ టెస్ట్ జరిగాయట. దాదాపు ఆరు గంటల పాటు ఈ టెస్టులు జరిగాయని ఫిల్మ్ నగర్‌ సమాచారం. యాత్ర మూవీకి వచ్చిన రెస్సాన్స్ ని దృష్టిలో పెట్టుకుని ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తున్నారు మేకర్స్.

లుక్‌ టెస్ట్ కి కోలీవుడ్‌ హీరో జీవాతో పాటు ఓ హిందీ హీరో, ఓ మలయాళ హీరో కూడా అటెండ్‌ అయ్యారన్నది వైరల్‌ అవుతున్న న్యూస్‌. జగన్‌ మోహన్‌రెడ్డి పాత్రకు సరిపోయే హిందీ, మలయాళ స్టార్లు ఎవరెవరున్నారని ఆరా తీస్తున్నారు నెటిజన్లు. యాత్ర ఫస్ట్ పార్ట్ లో వై.యస్‌.రాజశేఖర్‌రెడ్డిగా మమ్ముట్టి మెప్పించారు. కాబట్టి, ఇప్పుడు సీక్వెల్‌లో జగన్‌ కేరక్టర్‌కి కూడా మలయాళం హీరోని సెలక్ట్ చేస్తే సెంటిమెంట్‌ పరంగా బావుంటుందనే సజెషన్స్ కూడా వినిపిస్తున్నాయి.
లుక్‌ టెస్ట్, కాస్ట్యూమ్‌ టెస్టుల్లో ఎవరు పక్కాగా ఫిట్‌ అవుతారనిపిస్తే వారికే ఓటేయాలని డిసైడ్‌ అయ్యారు డైరక్టర్‌ మహి.వి.రాఘవ్‌. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్‌ మొదలుపెట్టడానికి ఇప్పటి నుంచే ఫుల్‌ ఫోకస్‌ చేస్తున్నారు కెప్టెన్. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కానుంది యాత్ర2.