AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shabaash Mithu: తాప్సీ కలిసి ప్రమోషన్స్‌లో సందడి చేస్తోన్న మిథాలీ రాజ్‌తో.. శభాష్ మిథు రిలీజ్ ఎప్పుడంటే..

తాప్సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్ గా తెలుగులో పరిచయం అయ్యింది. మొదటి సినిమాతోనే తన అందంతో చలాకీతనంతో ఆకట్టుకుంది ఈ చిన్నది.

Shabaash Mithu: తాప్సీ కలిసి ప్రమోషన్స్‌లో సందడి చేస్తోన్న మిథాలీ రాజ్‌తో.. శభాష్ మిథు రిలీజ్ ఎప్పుడంటే..
Taapsee Pannu, Mithali Raj
Rajeev Rayala
|

Updated on: Jul 14, 2022 | 8:15 AM

Share

తాప్సీ( Taapsee Pannu) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్ గా తెలుగులో పరిచయం అయ్యింది. మొదటి సినిమాతోనే తన అందంతో చలాకీతనంతో ఆకట్టుకుంది ఈ చిన్నది. ఆతర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేసి బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ దూసుకుపోతోంది తాప్సీ. తాజాగా ఈ అందాల భామ నటించిన సినిమా శభాష్ మిథు. దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా బాలీవుడ్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో తాప్సీ పన్ను మిథాలీ రాజ్ పాత్రను పోషిస్తుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో రికార్డు బద్దలు కొట్టిన మిథాలీ రాజ్, వన్డేల్లో 10000 పరుగులకు పైగా చేసింది. ఈ చిత్రంలో ఆమె లెజెండరీ క్రికెటర్‌గా మారే ప్రయాణాన్ని, ఆమె ఎదుర్కొన్న పరిస్థితులను చూపించనున్నాడు దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీ.

ప్రస్తుతం శభాష్ మిథు రిలీజ్ కు రెడీ గా ఉంది, జులై 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి సంబంధిన ప్రొమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తాప్సీ తో పాటు క్రికెటర్ మిథాలీ రాజ్ కూడా ఈ ప్రొమోషన్స్ లో పాల్గొనడం గమనార్హం. ప్రచారంలో భాగంగా హైదరాబాద్ వేదికగా పత్రికా విలేకర్లు తో పాటు అభిమానులతో ముచ్చటించారు. ఇదివరకే భారత దిగ్గజ క్రికెటర్లలో ఒకరైన సౌరవ్ గంగూలీ ఈ ట్రైలర్ ను లాంచ్ చేసారు. “శభాష్ మిథు” ట్రైలర్ అనూహ్య స్పందన లభించింది. వయాకామ్ 18 స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం జూలై 15న గ్రాండ్ గా విడుదలకానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us
నా మీద 9 కోట్లు పెట్టి సినిమా తీస్తే మొత్తం పోతాయ్..జగపతి బాబు..
నా మీద 9 కోట్లు పెట్టి సినిమా తీస్తే మొత్తం పోతాయ్..జగపతి బాబు..
ఆ ఒక్క బ్యానర్ వల్ల అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టుకు భారీ షాక్?
ఆ ఒక్క బ్యానర్ వల్ల అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టుకు భారీ షాక్?
మీ పార్ట్‌నర్‌తో ఏకాంతంగా ఉన్నప్పుడు ఫోన్‌లో ఈ సెట్టింగ్స్..
మీ పార్ట్‌నర్‌తో ఏకాంతంగా ఉన్నప్పుడు ఫోన్‌లో ఈ సెట్టింగ్స్..
సూర్యోదయం ఫోటోను ఈ గదిలో పెడితే శుభం.. కానీ ఇక్కడ మాత్రం అస్సలు..
సూర్యోదయం ఫోటోను ఈ గదిలో పెడితే శుభం.. కానీ ఇక్కడ మాత్రం అస్సలు..
గురు మూఢమిలో ఆస్తిపాస్తులతో ఆ రాశుల వారు జాగ్రత్త!
గురు మూఢమిలో ఆస్తిపాస్తులతో ఆ రాశుల వారు జాగ్రత్త!
మనుషులు కాదు.. మృగాలు! బాలికపై ముగ్గురు ఆటో డైవర్ల పైశాచికం!
మనుషులు కాదు.. మృగాలు! బాలికపై ముగ్గురు ఆటో డైవర్ల పైశాచికం!
పెళ్లి ఇష్టం లేక యువతి గుండు చేయించుకుందా?వైరల్ వీడియో వెనుక నిజం
పెళ్లి ఇష్టం లేక యువతి గుండు చేయించుకుందా?వైరల్ వీడియో వెనుక నిజం
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
ఇంటి బెడ్‌రూమ్‌లో పడిన ఉల్క.. భూమిపై జీవం పుట్టుకపై సంచలన నిజాలు!
ఇంటి బెడ్‌రూమ్‌లో పడిన ఉల్క.. భూమిపై జీవం పుట్టుకపై సంచలన నిజాలు!
గూగుల్ పిక్సెల్ 11 వస్తోంది.. విడుదల తేదీ ఖరారు.. ఫీచర్స్‌ లీక్..
గూగుల్ పిక్సెల్ 11 వస్తోంది.. విడుదల తేదీ ఖరారు.. ఫీచర్స్‌ లీక్..